Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో షాక్… పార్టీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై-dasoju sravan kumar resign to congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Dasoju Sravan Kumar Resign To Congress Party

Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో షాక్… పార్టీకి దాసోజు శ్రవణ్ గుడ్ బై

Mahendra Maheshwaram HT Telugu
Aug 05, 2022 02:48 PM IST

టీ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. పార్టీలో కీలకంగా ఉన్న జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు.

దాసోజు శ్రవణ్ (ఫైల్ ఫొటో)
దాసోజు శ్రవణ్ (ఫైల్ ఫొటో) (twitter)

dasoju sravan kumar resign to congress: రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ రాజీనామా చేశారు. చాలా రోజులుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న శ్రవణ్.... కొద్దిరోజులుగా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవల పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బరిలో ఉండేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి చేసిన శ్రవణ్... డైలామాలో పడిపోయారు. అయితే పార్టీకి రాజీనామా అంశంపై శ్రవణ్ సాయంత్ర మీడియాతో మాట్లాడారు.

రేవంత్ పై తీవ్ర విమర్శలు...

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీలో అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. కులం, ధనానికే ప్రాధాన్యం పెరిగిందని... కాంగ్రెస్ పార్టీ సామాజిక సిద్ధాంతాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. వ్యాపార, రాజకీయ లబ్ధి పొందాలనేదే రేవంత్‌ ఆరాటమని... ఆయనకు మాణిక్కం ఠాగూర్‌, వ్యూహకర్త సునీల్‌ మద్దతు ఉందని అన్నారు.పార్టీని రేవంత్ రెడ్డి ప్రైవేట్‌ ప్రాపర్టీగా మారుస్తున్నారని... ఏఐసీసీ నుంచి ఫ్రాంచైజీగా పార్టీని తెచ్చుకున్నట్లు రేవంత్‌ వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. కొప్పుల రాజు, జైరామ్‌ రమేశ్‌ లాంటి వారు తెలంగాణ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని ఇవాళ వారు కూడా స్పందించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డి ఎవరికీ అందుబాటులో ఉండరరని తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మాఫియా తరహా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు.

ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లో వచ్చిన శ్రవణ్... ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతగా పేరు సంపాదించారు. పార్టీలోనూ కీలక వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కై గుడ్ బై చెప్పి... కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి... దానం నాగేందర్ చేతిలో ఓటమిపాలయ్యారు.

ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో… కీలకంగా ఉన్న దాసోజు వంటి నేతలు రాజీనామా చేయటం టెన్షన్ పుట్టిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్