AP TG Weather Updates: ఏపీకి తప్పిన ముప్పు, తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన-cyclone threat missed to ap rain forecast for telugu states ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ap Tg Weather Updates: ఏపీకి తప్పిన ముప్పు, తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

AP TG Weather Updates: ఏపీకి తప్పిన ముప్పు, తీవ్ర తుఫానుగా మారనున్న వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Sarath chandra.B HT Telugu

AP TG Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా ఆ తర్వాత తీవ్ర తుఫానుగా మారనుంది. తుఫాను గమనం మారడంతో ఏపీకి ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఏపీకి తప్పిన తుఫాను ముప్పు, తీవ్ర తుఫాను బంగ్లావైపు పయనం

AP TG Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య దిశగా పయనిస్తూ ఏపీ నుంచి దూరంగా కదులుతున్నట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం నాటికే తీవ్ర అల్పపీడనంగా బలపడటంతో. శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని అంచనా వేశారు. వాయుగుండంగా మారిన తర్వాత ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుంది.

ఆ తర్వాత ఉత్తర దిశగా పయనిస్తూ పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌ తీరాలకు చేరువ అవుతందని అంచనా వేశారు. ఆదివారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారుతుందని దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో పశ్చిమబెంగాల్ తో పాటు ఒడిశా, మిజోరం, త్రిపుర, మణిపుర్‌ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ ప్రకటించింది.

తుఫాను ప్రభావంతో ఏపీతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, తుఫాను పయనించే మార్గాన్ని బట్టి భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని లేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

ఐఎండి సూచనల ప్రకారం బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి తూర్పుమధ్య బంగాళాఖాతం వద్ద తుఫానుగా మారే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్ & పశ్చిమబెంగాల్ తీరాలకు తీవ్ర తుఫానుగా చేరుకుంటుందని ప్రస్తుతానికి దీని వలన ఏపీకు ఏటువంటి ముప్పులేదని తెలిపారు.

శని, ఆదివారాల్లో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.

శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది.

ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఉత్తరాంధ్రలో వడగాలులు…

శుక్రవారం శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 11 , పార్వతీపురంమన్యంలో 11, కాకినాడ 1, తూర్పుగోదావరి గోకవరం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. గురువారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 40.9°C, వైయస్ఆర్ జిల్లా సింహాద్రిపురం, ఎన్టీఆర్ నందిగామలో 40.7°C, పల్నాడు జిల్లా నరసరావుపేటలో40.3°C, ప్రకాశం జిల్లా కనిగిరిలో 40.2°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఎండ తీవ్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు…

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడి వానలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళా ఖాతం, అండ మాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించాయి. బంగళాఖాతంలో అల్ప పీడనం బలపడింది. బుధవారం నుంచి గురు వారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా హనుమకొండ జిల్లా వేలేర్ మండలంలో 6.2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్లో 5.2, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 3.8, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో 3.3 సెం.మీటర్ల వర్షం కురిసినట్టు ఐఎండి ప్రకటించింది. కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి' జిల్లాలతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

ఓ వైపు వానలు, మరో వైపు ఎండలు…

ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురువారం రాష్ట్రంలోనే అత్యధి కంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లిలో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 43.1, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్, కడెం పెద్దూరు మండల కేంద్రం, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కిలలో 42.9 డిగ్రీల ఉష్ నమోదయ్యాయి.

సంబంధిత కథనం