Rakul Preet Singh Brother : హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 199 గ్రాముల కొకైన్‌ను హైదరాబాద్‌లో విక్రయానికి తీసుకువస్తున్నట్లు గుర్తించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించింది. ఈ డ్రగ్స్ ను 30 మంది కస్టమర్‌లను ఇచ్చేందుకు తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. నార్కోటిక్, ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ చేసి డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ రూ.2 కోట్ల విలువ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ డ్రగ్స్ రాకెట్ లో అరెస్టైన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు.
"డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేశాం. ఈ దాడిలో ఐదుగురిని అరెస్టు చేశాం. వీరిలో ఇద్దరు నైజీరియన్లు, ముగ్గురు స్థానికులు ఉన్నారు. 199 గ్రాముల కొకైన్, నైజీరియన్ల పాస్ పోర్టులు, రెండు టూవీలర్స్, సెల్ ఫోన్లు సీజ్ చేశాము. డ్రగ్స్ రాకెట్ కింగ్ పిన్ అబుకార్ సుజీ, ఇతను నైజీరియన్. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అబుకార్ సుజీ ప్రధాన అనుచరురాలైన అనుహా బ్లెస్సింగ్ అనే మహిళను అరెస్టు చేశాము. ఈమె ధూల్ పేట్ లో ఒక డ్రగ్స్ కేసులో అరెస్టైంది. ప్రస్తుతం బెయిల్ పై ఉంది. ఆమె 20 సార్లు హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువచ్చినట్లు విచారణలో తెలిసింది. ఆమె ఆఫ్రికా దేశానికి చెందిన ఓ ఫేక్ పాస్ పోర్టుతో హైదరాబాద్ వచ్చింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 5 గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
విశాఖపట్నానికి చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్ ప్రస్తుతం బెంగళూరులో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. ఇతనిపై కేపీహెచ్బీలో డ్రగ్స్ కేసు ఉంది. ఇంకొకరు అమలాపురానికి చెందిన వరుణ్ కుమార్ ఇతను కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతను బొరబండలో ఉంటాడు. రాజేంద్రనగర్ కు చెందిన మహబూబ్ షరీఫ్ అనే కొరియోగ్రఫర్ ను పట్టుకున్నాము. వీళ్లు ఐదుగురు డ్రగ్స్ తీసుకొని సరఫరా చేసేందుకు రెడీ అవుతుండగా అరెస్టు చేశాం. వీళ్ల నుంచి రాబట్టిన సమాచారంతో ఐదుగురు కస్టమర్లను గుర్తించాం. వారికి డ్రగ్స్ టెస్ట్ చేశాము, వారందరికీ పాజిటివ్ వచ్చింది. అనికేత్ రెడ్డి, ప్రసాద్, అమన్ ప్రీత్ సింగ్, మధుసూదన్, నిఖిల్ ధామన్ ఈ ఐదుగురికి పరీక్షల కోసం ఆసుపత్రికి పంపాము"-సైబరాబాద్ పోలీసులు
సంబంధిత కథనం