Cyber security course in Degree: ఇక డిగ్రీలో 'సైబర్‌ సెక్యూరిటీ' కోర్సు-cyber security course introduce for degree students in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cyber Security Course Introduce For Degree Students In Telangana

Cyber security course in Degree: ఇక డిగ్రీలో 'సైబర్‌ సెక్యూరిటీ' కోర్సు

HT Telugu Desk HT Telugu
Mar 10, 2023 06:46 AM IST

cyber security course in degree: డిగ్రీలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సును ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఈ కోర్సును అమల్లోకి తీసుకురానుంది.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం
తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం

Telangana State Council of Higher Education: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే పనిలో పడింది ఉన్నత విద్యామండలి. ఇప్పటికే డిగ్రీ స్థాయిలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టగా... తాజాగా మరో అడుగు ముందుకేసింది. ప్రపంచానికి సవాల్ విసురుతున్న అంశాల్లో సైబర్ నేరాలు కూడా ఒకటి. ఆయా విషయాల్లో కనీస అవగాహన లేక ఏంతో మంది బలైపోతున్నారు. ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది ఉన్నత విద్యామండలి. ఇక డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును తీసుకురావాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

ట్రెండింగ్ వార్తలు

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడమేగాక, వాటిని అరికట్టే యోధులను తయారుచేసేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. నల్సార్ వర్శిటీ, ఉస్మానియా వర్సిటీ విషయ నిపుణులచే ఈ కోర్సును రూపొందించినట్టు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే కొత్త విద్యాసంవత్సరంలోనే సైబర్‌ సెక్యూరిటీతో పాటు బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ మేజర్‌ సబ్జెక్టుగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌లర్నింగ్‌ను మైనర్‌ సబ్జెక్టులుగా నిర్వహించేలా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రైవేట్‌ అనుబంధ డిగ్రీ కాలేజీలకు కోర్సులవారీగా కాకుండా జెనరిక్‌ అఫిలియేషన్‌ మంజూర చేయనున్నారు.

జూలైలోనే డిగ్రీ తరగతులు...

వచ్చే కొత్త విద్యా సంవత్సరం (2023-24) డిగ్రీ తరగతులను జులైలో ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. గురువారం నిర్వహించిన సమవాశంలో ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. బీఎస్‌సీ ఎంపీసీ, ఎంపీసీఎస్‌ అని గతంలో కోర్సులుండేవి. అంటే ఆ కోర్సులో ఉన్న 3 ప్రధాన సబ్జెక్టులు ఇష్టమున్నా లేకున్నా విద్యార్థులు చదవాల్సిందే. అందుకు భిన్నంగా మూడేళ్ల కిందట బకెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టి బీఎస్‌సీ ఫిజికల్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్స్‌గా విభజించినట్లు అధికారులు ప్రకటించారు. ఫిజికల్‌ సైన్స్‌లో కొన్ని సబ్జెక్టులు, లైఫ్‌ సైన్స్‌లో మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. విద్యార్థులు వాటిలో తమకిష్టమైన మూడు సబ్జెక్టులను ఎంచుకునే అవకాశం ఉండనుందని పేర్కొన్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం