CTET Notification 2024 : టీచర్ అభ్యర్థులకు అలర్ట్... సీటెట్ నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే
Central Teacher Eligibility Test : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)- డిసెంబరు 2024 నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) వివరాలను ప్రకటించింది. ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబరు 16వ తేదీని తుది గడువుగా పేర్కొంది.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్)- డిసెంబరు 2024 నోటిఫికేషన్ వచ్చేసింది. జాతీయ సంస్థల విద్యాసంస్థలు లేదా రాష్ట్రంలోని విద్యా సంస్ఖల్లో పని చేసే ఉపాధ్యాయులు ఈ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారు… ఎక్కడైనా టీచింగ్ చేయవచ్చు. రాష్ట్రాల స్థాయిలో రాష్ట్ర అర్హత పరీక్షలు ఉండగా… జాతీయ స్థాయిలో సీటెట్ ను నిర్వహిస్తారు.
ఏడాదికి రెండుసార్లు జాతీయ స్థాయిలో ఈ పరీక్షను సీబీఎస్‌ఈ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 10 వరకు అప్లికేషన్లు సమర్పించవచ్చు.
సీటెట్ ఆన్‌లైన్ పరీక్షను డిసెంబరు 1న జరగనుంది. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు ఒక్క పేపర్‌కు అయితే రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) చెల్లించాలి. అదే 2 పేపర్లు రాయాలనుకుంటే రూ.1200 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600) చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి.
CTET 2024 పరీక్షకు ఎలా దరఖాస్తు చేయాలి?
- Step 1 : సీటెట్ అధికారిక వెబ్‌సైట్ https://ctet.nic.in/ సందర్శించండి.
- Step 2 : అభ్యర్థి యాక్టివిటీ బోర్డ్ కింద ఉన్న CTET డిసెంబర్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- Step 3 : అభ్యర్థి తన సమాచారాన్ని నమోదు చేసుకోండి.
- Step 4 : ఆ తర్వాత మీ వివరాలతో ఖాతాను లాగిన్ చేయండి.
- Step 4 : CTET దరఖాస్తు ఫామ్‌ను నింపండి.
- Step 5 : ఫొటో, సంతకం, ఇతర అవసరమైన సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి.
- Step 6 : సీటెట్ రుసుము చెల్లించండి.
సీటెట్ పరీక్ష విధానం:
సీటెట్ స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలకు జరిగి ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్ స్కోరుకు లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్ ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు.
ఒకటి నుంచి 5వ తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-1, 6 నుంచి 9వ తరగతుల వరకు బోధించాలనుకునే అభ్యర్థులు పేపర్-2ను రాయవచ్చు. సీటెట్ లో ప్రశ్నలన్నీ మల్టిపుల్ ఛాయిస్ రూపంలోనే ఉంటాయి. నాలుగు ఆప్షన్స్‌లో ఒకటి ఎంపిక చేసి, ఓఎంఆర్‌లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేపర్-2 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు నిర్వహిస్తారు.
టాపిక్