Bike Silncers: నిబంధనలు ఉల్లంఘనలపై ఉక్కుపాదం, సిరిసిల్లలో భారీగా బైక్ సైలైన్సర్ల ధ్వంసం
Bike Silncers: రణగొణ ధ్వ నులు... అధిక శబ్దంతో రయ్యిమని దూసుకువచ్చే బైక్ లపై రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు కొరఢా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్దంగా సైలెన్సర్లు ఏర్పాటు చేసి అదిక శబ్దంతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే వారిపై చర్యలు చేపట్టారు.

Bike Silncers: నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై సిరిసిల్లలో మెరుపు దాడులు నిర్వహించి జిల్లా వ్యాప్తంగా కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటు చేసిన వారిని గుర్తించారు.
స్పెషల్ డ్రైవ్‌లో అధిక శబ్ధం చేసే 86 ద్విచక్ర వాహన సైలెన్సర్లను వాహనాల నుంచి తొలగించి రోడ్ రోలర్‌తో వాటిని తొక్కించి ధ్వంసం చేశారు. మరోసారి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లు వినియోగిస్తే జరిమానాతోపాటు క్రిమినల్ చర్యలు చేపడుతామని హెచ్చరించారు.
ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను తొలగించి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లను ఏర్పాటు చేస్తే మెకానిక్ తోపాటు వాహనదారుడిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమన్నారు
శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రై తో తనీఖీలు చేపట్టగా 86 ద్విచక్ర వాహనాలు నిబంధనలకు విరుద్దంగా సైలెన్సర్ లు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టామని తెలిపారు. వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలన్నారు.
ఎవరైనా సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమైతే నిబంధనల ప్రకారం జరిమానాతోపాటు వాహనాలను సీజ్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైన అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు గల వాహనాలు ఉంటే సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్.ఐ 8712656441 , వేములవాడ ట్రాఫిక్ ఎస్.ఐ 8712656440 కు సమాచారం ఇవ్వాలని కోరారు.
జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్లు బిగించిన ఐదు వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేసి ఆ వాహనాలను సీజ్ చేశారు.
కరీంనగర్‌లో బైక్ చోరుల అరెస్ట్…21 బైక్ లు స్వాదీనం…
ఇద్దరు ఇద్దరే...నచ్చిన బైక్ కనిపిస్తే చాలు మాయం కావడం ఖాయం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు 25 బైక్ లు చోరీ చేశారు. ఆ బైక్ లపైనే చక్కర్లు కొడుతు కరీంనగర్ లో పోలీసులకు చిక్కారు.
కరీంనగర్ టౌన్ ఏసిపి నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన గోనెల శంకర్ (36), బోయిని చంద్రబాబు (29) ఇద్దరు కలిసి కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో 25 బైక్ చోరీలకు పాల్పడ్డారు. పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతు బైక్ దొంగతనాలకు పాల్పడ్డారు. కరీంనగర్ వన్ టౌన్ సిఐ సరిలాల్ నేతృత్వంలో ఎస్ఐ స్వామి కమాన్ చౌరస్తా వద్ద వాహన తనిఖీ చేపట్టగా బైక్ దొంగల బండారం బయటపడింది.
వాహనాల తనిఖీల్లో బైక్ పేపర్లు అడుగగా తప్పించుకునే ప్రయత్నంచేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్ జిల్లా బైక్ దొంగలని తేలిందని ఏసిపి నరేందర్ తెలిపారు. పట్టుబడ్డవారి నుంచి 21 బైక్ లు స్వాదీనం చేసుకున్నామని చెప్పారు.
కరీంనగర్ లో 18 బైక్ లు చోరీ
పోలీసులకు చిక్కిన ఇద్దరు బైక్ దొంగలు కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15, టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడ్డారని ఏసిపి తెలిపారు. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు, గన్నేరువరం పరిధిలో ఓకటి, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బైక్ చోరీ చేసినట్లు ప్రకటించారు.
ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 379 ప్రకారం కేసు నమోదు చేశామని కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ జె.సరిలాల్ తెలిపారు. నిందితులను పట్టుకుని 21 బైకులు స్వాధీనం చేసుకోవడంలో కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఎస్సై స్వామి తో పాటు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
భూ కబ్జాదారులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్
భూ కబ్జాకు పాల్పడి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న గంగాదర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన గుర్రం రాజిరెడ్డి పై సస్పెక్ట్ షీట్ తెరిచినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.
రాజిరెడ్డి అక్రమంగా భూ ఆక్రమణలకు పాల్పడి పలు కేసుల్లో నిందితుడిగా ఉండమేగాక , వివిధ నేరాల్లో సైతం పాలుపంచుకున్నాడని శాంతి భద్రతల దృష్ట్యా అతనిపై చట్టపరంగా సస్పెక్ట్ షీట్ తెరిచే అవసరమున్నదని కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి అభ్యర్ధన మేరకు సస్పెక్ట్ షీట్ తెరిచినట్లు ఏసిపి ప్రకటించారు. నేరస్థుడైన గుర్రం రాజిరెడ్డి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు కదలికలను గమనించాలని కొత్తపల్లి ఎస్సైని రూరల్ ఏసీపీ ఆదేశించారు.
(రిపోర్టింగ్ కే.వీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం