Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ-cotton corporation warangal guntur branches jobs walk in interview offline application ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ

Cotton Corporation Jobs : వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ

Cotton Corporation Jobs : కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరంగల్, గుంటూరు బ్రాంచ్ ఆఫీసుల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వరంగల్ బ్రాంచ్ ఆఫీసులో పోస్టులకు అక్టోబర్ 16న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. గుంటూర్ ఆఫీసులో పోస్టుకు నవంబర్ 1వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

వరంగల్, గుంటూరు కాటన్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు-అక్టోబర్ 16న ఇంటర్వ్యూ

వరంగల్ లోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో 4 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలకు ఆహ్వానించారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ (జనరల్) , ఆఫీస్ అసిస్టెంట్ (అకౌంట్స్), ఆఫీస్ స్టాఫ్ క్లర్క్ వర్క్ (గోడౌన్) పోస్టులకు అక్టోబర్ 16న వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

వయస్సు, అర్హతలు

పోస్టులను అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్)తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అక్టోబర్ 1,2024 నాటికి 35 సంవత్సరాల వయస్సు మించకూడదు. ఫీల్డ్ స్టాఫ్ నకు రూ.37,000 వేతనం, ఇతర పోస్టులకు రూ.25,500 జీతం ఇస్తారు. అక్టోబర్ 16న ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2వ, 3వ అంతస్తు, లక్షీపురం, పాత గ్రైన్ మార్కెట్ దగ్గర, వరంగల్ వద్ద ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

కాటన్ కార్పొరేషన్ వైబ్ సైట్ : https://cotcorp.org.in/

గుంటూరు బ్రాంచ్ ఆఫీసులో ల్యాబ్ అసిస్టెంట్

కాటన్ కార్పొరేషన్ గుంటూరు బ్రాంచ్ లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ల్యాబ్ అసిస్టెంట్ కు నెలకు రూ. 25,500 వేతనం ఇస్తారు.

అర్హతలు

ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ స్ట్రుమెన్టేషన్ లో పాలిటెక్నిక్ డిప్లొమా

వయస్సు

10.10.2024 నాటికి 35 ఏళ్ల వయస్సు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, బీసీలకు 3 ఏళ్లు, పీహెచ్ వాళ్లకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంది.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుంటూరు బ్రాంచ్ ఆఫీసులో ల్యాబ్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎలక్ట్రికల్స్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ డిప్లొమా హోల్డర్లు, టెంపరరీ ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టు కోసం అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు నెలకు వేతనం రూ. 25,500 ఇస్తారు.

స్వీయ చిరునామా ఉన్న స్టాంప్ ఎన్వలప్‌ తో పాటు, దరఖాస్తు ఫారమ్, అవసరమైన సర్టిఫికేట్లు జత చేయాలి. కాటన్ కార్పొరేషన్ వెబ్ సైట్ www.cotcorp.gov.in నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దరఖాస్తు ఫారమ్ ను నింపాలి.

డేట్ ఆఫ్ బర్త్ రుజువు చేసే సర్టిఫికేట్, ఎస్ఎస్సీ, గ్రాడ్యుయేషన్ అటెస్టెడ్ కాపీలతో పాటు అలాగే డిగ్రీ సర్టిఫికేట్ కాపీ, కుల ధృవీకరణ పత్రం(వర్తిస్తే) పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు నవంబర్ 1వ తేదీ నాటికి జనరల్ మేనేజర్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్రాంచ్ ఆఫీస్ గుంటూరు.. ఈ అడ్రస్ కు పంపాలి.