TWDSC Dept Jobs: కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు, 50 వేల జీతం - వివరాలివే-coordinator and data entry jobs in telangana welfare of disabled and senior citizens department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Coordinator And Data Entry Jobs In Telangana Welfare Of Disabled And Senior Citizens Department

TWDSC Dept Jobs: కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు, 50 వేల జీతం - వివరాలివే

HT Telugu Desk HT Telugu
Nov 20, 2022 07:38 AM IST

TWDSC Department Jobs 2022: ఖాళీ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను ప్రకటించింది.

ఉద్యోగాల భర్తీకి ప్రకటన
ఉద్యోగాల భర్తీకి ప్రకటన (twdsc department,)

Telangana Welfare of Disabled and Senior Citizens Department Jobs 2022: హైదరాబాద్ పరిధిలో ఖాళీగా ఉన్న రెండు పోస్టులకు తెలంగాణ దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు పూర్తి వివరాలను ప్రకటించింది. పోస్టుని అనుసరించి ఏదైనా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్), కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు

వివరాలు....

హెల్ప్ డెస్క్ కోఆర్డినేటర్ - 01 పోస్టు

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, బీఏ(హ్యూమానిటి/సోషల్ సైన్సెస్/సోషియాలజి/సైకాలజీ/సోషల్ వర్క్). సంబధిత విభాగంలో 3 సంవత్సరాల అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

వయసు: 21 - 45 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకి రూ.50,000.

డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01 పోస్టు

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, డేటాఎంట్రీ ఆపరేషన్స్ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: 21 - 45 సంవత్సరాలు మించకూడదు.

జీతం: నెలకి రూ.26,749.

దరఖాస్తు విధానం: నిర్ణిత దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత ధ్రువపత్రాలు జతపరిచి నోటిఫికేషన్ వెలువడిన 10 రోజులలోగా డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగుల అండ్ వయోవృద్ధుల సంక్షేమ శాఖ మలక్‌పేట, నల్గొండ క్రాస్ రోడ్ హైదరాబాద్ నందు ఇవ్వాల్సి ఉంటుంది.

NOTE

ఉద్యోగాలకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ ని సంప్రదించండి.

నోటిఫికేషన్ కు సంబంధించి కింద ఇచ్చిన పీడీఎఫ్ ను చూడండి….

IPL_Entry_Point