Smita Sabharwal : తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సిద్ధమైంది. యూనివర్సిటీ నుంచి వాహన అద్దెకు తీసుకున్న నిధులపై అడిట్ విభాగం అభ్యంతరం తెలిపిది. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారని సమాచారం. వాహన అద్దె కింద తీసుకున్న రూ.61 లక్షల నిధులను తిరిగి చెల్లించాలని మరో రెండ్రోజుల్లో ఆమెకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
2016 నుంచి 2024 వరకు సీఎంవో అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ 90 నెలలకు గాను వాహన అద్దె కింద రూ. 61 లక్షలు తీసుకున్నారు. ఈ నిధులపై అభ్యంతం వ్యక్తం చేసిన ఆడిట్ విభాగం...న్యాయ నిపుణుల సూచనల మేరకు ఆమెపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
యూనివర్శిటీ అడిటింగ్ లో స్మితాసబర్వాల్ కు సంబంధించిన ఓ విషయం బయటపడింది. స్మితా సబర్వాల్ నెలకు రూ.63 వేలు వాహన అలెవెన్స్ తీసుకున్నట్లు అడిట్ అధికారులు గుర్తించారు. యూనివర్శిటీ నుంచి వెహికల్ అలవెన్స్ కింద మొత్తం 90 నెలలకు రూ.61 లక్షలు తీసుకోవడంపై ఆడిట్ అధికారుల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై యూనివర్సిటీ బోర్డు మీటింగ్లో అధికారులు చర్చించారు. స్మితా సబర్వాల్ వర్సిటీ నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి రాబట్టాలని బోర్డు మీటింగ్ లో నిర్ణయించినట్లు సమాచారం.
ఈ విషయంపై ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక అందించనున్నారు. అనంతరం స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసి నిధులు తిరిగి రాబట్టాలని వర్సిటీ అధికారులు యోచిస్తోన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో కీలక పదవుల్లో ఉన్న స్మితా సబర్వాల్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు విషయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా యూనివర్శిటీ నిధుల వ్యవహారంలో స్మితా సబర్వాల్ పేరు వినిపిస్తుంది.
సంబంధిత కథనం