Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Telangana Secretariat : తెలంగాణ సచివాలయంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తు నుంచి జీఆర్సీ ఫ్రేమ్ ఊడి పడింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఓ వాహనం ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. దీనిపై రివ్యూ చేస్తున్నట్టు పల్లోంజి సంస్థ వెల్లడించింది.

తెలంగాణ సచివాయలంలో ప్రమాదం తప్పింది. ఐదో అంతస్తులోని డోమ్ కింద ఉన్న జీఆర్సీ ఫ్రేమ్ కింద పడింది. దీంతో సచివాలయం కింద ఉన్న ఓ కాంగ్రెస్ నేత వాహనం ధ్వంసం అయింది. సచివాలయంలో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష నిర్వహించిన కాసేపటికే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పెచ్చులు కాదు.. జీఆర్సీ..
ఈ గటనపై షాపూర్ జి పల్లోంజి నిర్మాణ సంస్థ స్పందించింది. రెగ్యులర్ డిపార్ట్‌మెంట్ వర్క్‌లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనులు చేస్తున్నారని వివరించింది. ఇది నిర్మాణ లోపం వల్ల జరిగింది కాదని స్పష్టం చేసింది. ఈడి పడింది కాంక్రీట్ వర్క్ కాదు.. స్ట్రక్చర్‌కు ఎలాంటి ప్రాబ్లం లేదని వివరించింది. ఊడి పడింది జీఆర్సీ ఫ్రేమ్ అని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.
రివ్యూ చేస్తున్నాం..
ఇటీవల లైటింగ్ కోసం, కొత్త కేబుల్స్ కోసం జీఆర్సీ డ్రిల్ చేస్తున్నారని పల్లోంజి సంస్థ వివరించింది. డ్రిల్ చేస్తే జీఆర్సీ డ్యామేజ్ అవుతుందని తెలిపింది. స్ట్రక్చర్ నిర్మాణం పూర్తయి రెండేళ్లు అవుతుందని.. ఎలాంటి నాణ్యత లోపం లేదని వెల్లడించింది. అయినా ఈ ఘటనపై తాను రివ్యూ చేస్తున్నామని.. ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
లోపాలు ఉన్నాయని..
ఈ సచివాలయాన్ని గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే.. సచివాలయ నిర్మాణంలో పలు సమస్యలు ఉన్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. సచివాలయం నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. తన ఛాంబర్‌తో పాటు టాయ్‌లెట్స్‌లోనూ శబ్ధాలు వస్తున్నాయని.. అప్పట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులకు చెప్పారు.
కేసీఆర్ శంకుస్థాపన..
2019 జూన్ 27న సచివాలయం భవన నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆ సార్, పొన్ని కాన్సెస్సావో అనే ప్రఖ్యాత ఆరిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు. కేసీఆర్ ఆమోదించిన ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం రూపుదిద్దుకున్నది. ఈ సచివాలయాన్ని షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించింది.
ఇవీ ప్రత్యేకతలు..
ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్ హాళ్లను ఏర్పాటు చేశారు. ఇకడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించవచ్చు. 24 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. 5.60 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో రెండున్నర ఎకరాల్లో భవనాన్ని నిర్మించారు. రెండు బ్యాంకులు, పోస్ట్‌ఆఫీస్, ఏటీఎమ్ సెంటర్లు, రైల్వే కౌంటర్, బస్ కౌంటర్, క్యాంటీన్ ఉన్నాయి.