MP komatireddy venkat reddy return to hyderabad: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నుంచి ఆయన చేస్తున్న కామెంట్స్.. చర్చనీయాంశంగా మారాయి. అభ్యర్థి ఎంపిక తర్వాత కూడా ప్రచారానికి వస్తానంటూ చెప్పిన ఆయన.. చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. ప్రచారానికి దూరంగా ఉంటూ విదేశాలకు వెళ్లారు. ఇదే సమయంలో ఆయన మాట్లాడిన ఆడియోలతో పాటు వీడియో కూడా వైరల్ అయింది. ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో పార్టీ అధినాయకత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలవదనే వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
వీటిపై ఎంపీ కోమటిరెడ్డి స్పందించాల్సి ఉంది. రేపటితో(నవంబర్ 3) వివరణ ఇవ్వాల్సిన సమయం కూడా పూర్తి కానుంది. అయితే ఉప ఎన్నికలు పూర్తయిన తరువాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై స్పందిస్తారని అందరూ భావించారు. బైపోల్ పూర్తి అయిన తర్వాతే ఆస్ట్రేలియా నుంచి కూడా ఇండియాకు వస్తారని అనుకున్నారు. కానీ అంతకుముందే ఆయన హైదరాబాద్ కు చేరుకోవటంతో ఎంపీ కోమటిరెడ్డి ఏం చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.అయితే షోకాజ్ నోటీసులపై వివరణ ఇస్తారా..? లేదా..? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మరోవైపు రాష్ట్రంలో రాహుల్ జోడో యాత్ర నడుస్తోంది. పార్టీ నేతలంతా యాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎంపీ కోమటిరెడ్డి... యాత్రలో పాల్గొంటారా ..? లేదా..? అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నేతలు... తీవ్రంగా స్పందించారు. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి కూడా... మోసం చేశారని ఆరోపించింది.
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు(Munugode) స్థానిక ప్రజాప్రతినిధులకు ఫోన్ల్ చేసిన్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని కామెంట్స్ చేశారు. పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని కోరినట్లు ఆడియోలో ఉంది. ఇదే కాకుండా... ఓ వీడియో కూడా బయటికి వచ్చింది. ఇందులో కూడా మునుగోడులో పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు. ఈ విషయం అధిష్టానం దగ్గరకు వెళ్లింది. దీంతో ఈ వ్యాఖ్యలపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ(Congress Party) క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.