Mlc Mallanna On Caste Census : కేసీఆర్ సర్వేనే కరెక్ట్- కులగణనపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు-congress mlc teenmar mallana sensational comments on caste census says this is janareddy survey ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Mallanna On Caste Census : కేసీఆర్ సర్వేనే కరెక్ట్- కులగణనపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Mlc Mallanna On Caste Census : కేసీఆర్ సర్వేనే కరెక్ట్- కులగణనపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Mlc Mallanna On Caste Census : కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సర్వే బోగస్ అన్నారు. ఇది జానారెడ్డి సర్వే అంటూ విమర్శలు చేశారు. కేసీఆర్ సర్వేనే 100 శాతం కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ సర్వేనే కరెక్ట్- కులగణనపై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు

Mlc Mallanna On Caste Census : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు తలెత్తున్నాయి. గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తు్న్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...తాజాగా కులగణనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గం లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

కేసీఆర్ సర్వేనే కరెక్ట్

కుల గణనపై ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కుల గణన పూర్తిగా బోగస్ అని విమర్శించారు. ఇది జానారెడ్డి సర్వే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సర్వేనే 100 శాతం కరెక్ట్ అన్నారు. బీసీ కులగణన రిపోర్టును ఉ* పోసి తగలబెట్టాలని దారుణ వ్యా్ఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం లక్ష్యంగా సొంత పార్టీ నేతలు, మంత్రులపై సందర్భం దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నాయి. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై పార్టీ నేతలెవ్వరూ స్పందించకపోవడంతో... కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్దిపొందాలనే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంది.

బీఆర్ఎస్ ను కొనేంత డబ్బు

ఆదివారం హనుమకొండలో జరిగిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ వ్యక్తి సీఎం కావటం ఖాయమని అన్నారు. రేవంత్ రెడ్డే చివరి ఓసీ సీఎం అన్నారు. రెడ్డి, వెలమ సామాజిక వర్గం వారు తెలంగాణ వాళ్లే కాదన్నారు. తెలంగాణకు బీసీలే ఓనర్లని, బీసీల ఆర్థికంగా వెనకబడ్డారని నిజం కాదన్నారు. అవసరమైతే బీఆర్ఎస్ ను కొనేంత డబ్బు బీసీల వద్ద ఉందన్నారు. తెలంగాణలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని మల్లన్న డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలు 47 శాతం ఉన్నారని చెప్పడానికి 90 ఏళ్లు పట్టిందన్నారు. బీసీల సంఖ్య తగిన స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రద్దు చేసి బీసీలకు సమాన వాటా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వా్న్ని డిమాండ్ చేశారు. 2028 నుంచి తెలంగాణకు బీసీ వ్యక్తే సీఎం ఉంటారన్నారు. బీసీ వర్గాలు ప్రతి ఏడాదికి రూ.1.20 లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు జమ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం వారికి రూ.9 వేల కోట్లే ఖర్చు చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.