Rajiv gandhi statue war: మాజీమంత్రి కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్‌.. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే..-congress leader jagga reddy warns former minister ktr on rajiv gandhi statue issue ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajiv Gandhi Statue War: మాజీమంత్రి కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్‌.. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే..

Rajiv gandhi statue war: మాజీమంత్రి కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్‌.. రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేస్తే..

Basani Shiva Kumar HT Telugu
Aug 20, 2024 05:38 PM IST

Rajiv gandhi statue war: తెలంగాణలో రాజకీయం రాజుకుంది. అందుకు కారణమైంది రాజీవ్ గాంధీ విగ్రహం. తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతే గట్టిగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.

మీడియాతో మాట్లాడుతున్న జగ్గారెడ్డి
మీడియాతో మాట్లాడుతున్న జగ్గారెడ్డి

మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాస్ వార్నింగ్‌ ఇచ్చారు. రాజీవ్ విగ్రహం తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజీవ్ తెచ్చిన టెక్నాలజీతోనే కేటీఆర్ చదువుకున్నారన్న జగ్గారెడ్డి.. కల్లుతాగిన కోతిలా కేటీఆర్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు ఏం మాట్లాడాలో అర్థంకావడం లేదని.. కేటీఆర్‌ పొలిటికల్ కోచింగ్ తీసుకోవాలని జగ్గారెడ్డి హితవు పలికారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ఢిల్లీ గులామ్‌లు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు.. మీలా కన్నింగ్ నేచర్‌ తమదికాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం తర్వాత.. కేసీఆర్ కుటుంబం సోనియా ఇంటికి వెళ్లలేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి రాజీవ్ గాంధీ కృషి చేశారని వివరించారు. కేసీఆర్, కేటీఆర్‌కు మళ్లీ అధికారం రాదని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజలు వెంటే ఉన్నారు.. భవిష్యత్తులోనూ ఉంటారని జగ్గారెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ..

తెలంగాణ సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాజీవ్ విగ్రహాన్ని తీసేస్తామని అంటున్నారు.. అసలు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సింది సచివాలయం బయట కాదు.. లోపల అని స్పష్టం చేశారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

రాజీవ్ గాంధీకి.. తెలంగాణ ఏంటి సంబంధం..

రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అసలు తెలంగాణకు.. రాజీవ్ గాంధీకి ఏంటి సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గాంధీ రాజకీయ జీవితంలో ఒక్కసారైనా తెలంగాణ అనే పదాన్ని పలికారా అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వ్యక్తి విగ్రహం తెలంగాణ సచివాలయంలో ఎందుకని నిలదీస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రాజీవ్ విగ్రహాలు చాలానే ఉన్నాయని.. అవి చాలని అంటున్నారు.