TS TTC Exams 2023 : ఆగస్టు 27న టీటీసీ పరీక్షలు - హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి-conduct of ttc exams from august 27 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Conduct Of Ttc Exams From August 27

TS TTC Exams 2023 : ఆగస్టు 27న టీటీసీ పరీక్షలు - హాల్ టికెట్లు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 26, 2023 01:09 PM IST

TS TTC Exams 2023:టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) లోయర్‌ గ్రేడ్‌ థియరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఆగస్టు 27న నిర్వహించనున్నట్టు పాఠశాల పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

టీటీసీ పరీక్షలు
టీటీసీ పరీక్షలు

TS TTC Exams 2023: టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ (టీటీసీ) లోయర్‌ గ్రేడ్‌ థియరీ పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది పాఠశాల పరీక్షల విభాగం. 42 రోజుల కోర్సును పూర్తి చేసిన వారి ఆగస్టు 27వ తేదీన పరీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు టైమింగ్స్ తో పాటు సెంటర్ల వివరాలను వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

-ఆగస్టు 27వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకూ సైకాలజీ, స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ ఉంటుంది.

- మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్ ఎగ్జామ్ ఉంటుంది.

-మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ మెథడ్స్‌ ఆఫ్‌ టీచింగ్‌ స్పెషల్‌ సబ్జెక్టులపై పరీక్ష నిర్వహిస్తారు.

- హాల్‌టికెట్లు https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.

పరీక్ష సెంటర్లు :

ఈ పరీక్షను హైదరాబాద్, నిజామాబాద్, హన్మకొండ, కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు…. అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని… సెంటర్లను కూడా ముందుగానే చూసుకోవాలని సూచించారు.

NOTE:లింక్ పై క్లిక్ చేసి టీటీసీ హాల్ టికెట్లను పొందవచ్చు.

ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు…

Telangana State Board of Intermediate Education: ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 16తో ముగిసింది. అయితే ఈ సమయాన్ని ఆగస్టు 31వ తేదీకి పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

తాజాగా ప్రైవేటు కాలేజీల్లో చేరాలనుకునే వాళ్లు ఆలస్య రుసుం కింద రూ.750 చెల్లించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో మాత్రం ఎలాంటి ప్రత్యేక ఫీజు కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. అడ్మిషన్లు తీసుకొని విద్యార్థులు... తాజాగా పొడిగించిన గడువు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

ఇంటర్మీడియట్‌ తరగతులు జూన్‌ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఇక 2023 -24 విద్యాసంవత్సరం అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇప్పటికే విడుదల చేసింది ఇంటర్‌బోర్డు.మొత్తంగా 227 రోజులపాటు తరగతులు నిర్వహించేలా షెడ్యూల్‌ను రూపొందించింది.

జూన్ 1, 2023 పునఃప్రారంభం

అర్ధవార్షిక పరీక్షలు 20-11-2023 నుంచి 25-11-2023

ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌ 2024 ఫిబ్రవరి రెండో వారంలో

ఇంటర్‌ వార్షిక పరీక్షలు 2024 మార్చి మొదటి వారంలో

దసరా సెలవులు 19-10-2023 నుంచి 25-10- 2023

పునః ప్రారంభం 26 అక్టోబర్‌ 2023 నుంచి

సంక్రాతి సెలవులు 13-1-2024 నుంచి 16-1-2023

పునః ప్రారంభం 17 జనవరి 2024 నుంచి

వేసవి సెలవులు 1-4-2024 నుంచి 31-5-2024

మొత్తం పని దినాలు - 227

WhatsApp channel