Universities : యూనివ‌ర్సిటీల్లో నియామకాలకు కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు-common recruitment board for universities in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Universities : యూనివ‌ర్సిటీల్లో నియామకాలకు కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు

Universities : యూనివ‌ర్సిటీల్లో నియామకాలకు కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు

HT Telugu Desk HT Telugu

తెలంగాణ‌లోని యూనివర్సిటీల్లో సిబ్బంది నియామ‌కాల కోసం ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది.

ఉస్మానియా యూనివర్సిటీ

రాష్ట్రంలోని యూనివ‌ర్సిటీల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామ‌కాల ప్రక్రియ కోసం కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీని ద్వారా నియామకాలు చేపడతారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ మిన‌హా మిగ‌తా 15 యూనివ‌ర్సిటీల్లో నియామ‌కాల‌ను కామ‌న్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా భ‌ర్తీ చేస్తారు.

ఈ బోర్డుకు ఛైర్మన్ గా ఉన్నత విద్యామండ‌లి ఛైర్మన్ ఉంటారు. బోర్డు క‌న్వీన‌ర్‌గా క‌ళాశాల విద్యాశాఖ క‌మిష‌న‌ర్, స‌భ్యులుగా విద్యాశాఖ‌, ఆర్థిక శాఖ కార్యదర్శులు కొన‌సాగ‌ుతారు. ఈ మేర‌కు నియామ‌క బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది.

బోర్డు ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా బోర్డులోని ఇతర సభ్యులను కో-ఆప్ట్ చేస్తుంది. సాధారణ బోర్డు పనితీరు మరియు ఇతర మార్గదర్శకాలు విడిగా జారీ చేస్తారు. ఇవి కాకుండా, విశ్వవిద్యాలయాల చట్టానికి అవసరమైన సవరణలు విడిగా జారీ చేస్తారు.