CM Election Campaign: నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన... ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం…-cm revanths tour of three districts today mlc election campaign ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Election Campaign: నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన... ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం…

CM Election Campaign: నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ పర్యటన... ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం…

HT Telugu Desk HT Telugu

CM Election Campaign: ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈరోజు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు.

నేడు మూడు జిల్లాల్లో కాంగ్రెస్ బహిరంగ సభలు

CM Election Campaign: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌ రెడ్డి మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. సీఎం తోపాటు పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ పలువురు మంత్రులు హాజరై ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల లో పట్టభద్రులతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొనబోతున్నారు. రేపటితో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఆఖరి మోకాగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కి పార్టీ నేతల సహకారం సన్నగిల్లిందనే ప్రచారం జోరు అందుకుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

మూడు బహిరంగ సభలు…

ఈరోజు సోమవారం నిజామాబాద్, మంచిర్యాల కరీంనగర్ మూడు చోట్ల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే ఎమ్మెల్సీ పట్టభద్రుల భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం టూర్ ఖరారు కావడంతో మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు చేరుకొని పార్టీ శ్రేణులతో సమావేశమై ఏర్పాట్ల పై దృష్టి పెట్టారు. సభకు ప్రతి కార్యకర్త ఒక పట్టభద్రుని తీసుకొని హాజరు కావాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.

65 శాతం ఓట్లు పొందేలా కార్యాచరణ...

కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం లో 355159 మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా పంతులు 50 శాతం మంది ఓటర్లు తమ వారే ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 65% ఓట్లు పొందడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందు పోతుందని స్పష్టం చేశారు.‌ అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు.

ప్రచార సభలో ఏం చేశామ్, ఏం చేయబోతున్నామో చెప్పడం జరుగుతుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గత ఐదేళ్ళలో ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మత రాజకీయాలు చేయడం కాదు, బిసి రిజర్వేషన్ పై చట్టం చేసే బాధ్యత తీసుకోవాలని సూచించారు. బండి సంజయ్ తన బాధ్యతను విస్మరించాలని చూస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈబిసిలకు పది శాతం నరేంద్ర మోడీ రిజర్వేషన్ కల్పించారని, అందులో ముస్లీంలు కూడా వస్తారని, బీసీల్లో ముస్లింలకు కలుపొద్దు అంటున్న బండి సంజయ్ ముందుగా దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎవరితో ఎవరున్నారో తేల్చుకుందాం రండీ...శ్రీధర్ బాబు సవాల్..

బీసీ రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ, ఎస్సీల వర్గీకరణ పై బిజెపి వైఖరి స్పష్టం చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.‌ బిజెపి బిఆర్ఎస్ రెండు ఒక్కటేనని, తమకు ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్సేనని కరీంనగర్ స్పష్టం చేశారు.‌ ఎవరు ఎవరితో ఉన్నారో తేల్చుకుందాం రండీ అని బిజేపికి సవాల్ విసిరారు.

మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. ప్రస్తుతం ఎమెల్సీ ఎన్నికల్లో బిజెపి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ వేసి కులగణన పై సర్వే చేసి బిసీ లకు న్యాయం చేసేందుకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని సంకల్పించామని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం చేశామని చెప్పారు. ఈ రెండు ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సిన ధర్మం బిజేపి పై ఉందన్నారు. 50 శాతం మించకుండా రిజర్వేషన్ కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయడానికి బిజేపి సిద్దమా అని ప్రశ్నించారు. ముస్లింలకు రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్న బిజెపి, ఈబీసీని తీసుకొచ్చింది నరేంద్ర మోడీ సర్కారేనని గుర్తుంచుకోవాలన్నారు.

317 జీవో పుణ్యం బిజేపిదేనని, దానికి సహకరించింది టిఆర్ఎస్... వాస్తవం కాదా బిజేపి సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజేపి కి టిఆర్ఎస్ మిత్రపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. గ్రూప్ వన్ పరీక్షను అడ్డుకోవడానికి బిజేపి బిఆర్ఎస్ యత్నించాయని విమర్శించారు. పదేళ్ళ పాలనలో ఎందుకు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదో, రాబోయే కాలంలో పట్టభద్రులకు ఏం చేస్తారో బిజేపి చెప్పకుండా దుష్ప్రచారంతో బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార పార్టీలు..

ఎమ్మెల్సీ ఎన్నికలను కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రెండు అధికార పార్టీలకు ఎమ్మెల్సీ ఎన్నిక పరీక్షలా మారడంతో అటు బిజెపి, ఇటు కాంగ్రెస్ నేతలు ఈ రెండు రోజుల్లో జోరుగా ప్రచారం సాగించి పట్టభద్రుల ఓటర్లను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.

ఐదు రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోనే మకాం వేసి ప్రచారం సాగిస్తుండగా ఆటు కిషన్ రెడ్డి మెదక్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించి ప్రచారం చేశారు.‌ ఇక కాంగ్రెస్ కు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు మూడు రోజులుగా కరీంనగర్ లోనే మకాం వేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులకు దీటుగా బిఎస్పి అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ గౌడ్ సైతం సింహ గర్జన పేరుతో కరీంనగర్ లో సభ నిర్వహించారు. ఆఖరి మోకా గా ప్రచారాన్ని హోరెత్తించి ఓటర్లను ఆకర్షించి మచ్చక చేసుకునే పనిలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నిమగ్నమయ్యారు.‌

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం