Vemulawada CM Tour: వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన,కోడె మొక్కులు చెల్లింపు, రూ.800కోట్లతో అభివృద్ధిపనుల శ్రీకారం
Vemulawada CM Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వేములవాడ విచ్చేసిన రేవంత్ రెడ్డికి మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు.
Vemulawada CM Tour: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు ముఖ్యమంత్రి హోదాలో తోలిసారి జిల్లాకు వచ్చిన సీఎంకు మంత్రులు ఘన స్వాగతం పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటంచనున్నారు. వేములవాడకు చేరుకునున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు స్వాగతం పలికారు.
సీఎం రేవంత్ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని, అభిషేకం నిర్వహించి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వేములవాడ ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 800 కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేస్తారు.
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
- రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేస్తారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని అన్నదాన సత్రానికి 35.25 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగష్టులో స్వామి వారి దర్శనానికి వచ్చినపుడు హామీ ఇచ్చి, కేవలం మూడు నెలలు గడిచేలోగా ప్రభుత్వం నుండి నిధులు విడుదల చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర్వులు ఇప్పించారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా, మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి అన్నదాన సత్రం మంజూరు చేయడం పై రాజన్న భక్తుల హర్షం
జిల్లాలో అభివృద్ధి పనులు..
- రూ.235 కోట్లతో 4696 మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు భూమి పూజ చేస్తారు.
- రూ.50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు.
- రూ. 45 కోట్లతో చేపట్టే మూల వాగు బ్రిడ్జి నుంచి దేవస్థానం వరకు రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
- రూ. 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు.
- రూ.35 కోట్లతో చేపట్టే అన్నదానం సత్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
- రూ. 52 కోట్లతో కొనరావుపేట మండలంలో చేపట్టే హై లెవెల్ బ్రిడ్జి పనులు , రూ. 3 కోట్లతో నిర్మించే డ్రైన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
- మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు.
- సిరిసిల్ల లో రూ. 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనం, వేములవాడలో రూ. కోటి 45 లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంధాలయ భవనం, రూ. 4 కోట్ల 80 లక్షలతో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభించనున్నారు.
- గల్ఫ్ దేశాలలో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు.
- 631 శివశక్తి మహిళా సంఘాలకు 102 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు పంపిణీ చేస్తారు.
- మధ్యాహ్నం జాతర గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తారు.
- సీఎం పర్యటన నేపథ్యంలో వేములవాడలో బీఆర్ఎస్, మాజీ సర్పంచ్ లు, ఎబివిపి కార్యకర్తలు ముందస్తు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే అరెస్టులు చేశారు. దాదాపు100 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేకువ జామునుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తుల దర్శనం నిలిపివేశారు.
- (రిపోర్టింగ్ కేవీరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, హెచ్‌టి తెలుగు)