CM Revanth Reddy : కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు పారదర్శక విధానం, రేట్ల విషయంలో తలొగ్గేది లేదు- సీఎం రేవంత్ రెడ్డి-cm revanth reddy says easier trade policy to supply new liquor brands in excise review ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు పారదర్శక విధానం, రేట్ల విషయంలో తలొగ్గేది లేదు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు పారదర్శక విధానం, రేట్ల విషయంలో తలొగ్గేది లేదు- సీఎం రేవంత్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Jan 11, 2025 09:19 PM IST

CM Revanth Reddy : రాష్ట్రంలో మద్యం సరఫరాకు ముందుకు వచ్చే కంపెనీల ఎంపికకు పారదర్శక విధానం అమలుచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేట్ల విషయంలో కంపెనీ ఒత్తిడికి తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు పారదర్శక విధానం, రేట్ల విషయంలో తలొగ్గేది లేదు- సీఎం రేవంత్ రెడ్డి
కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు పారదర్శక విధానం, రేట్ల విషయంలో తలొగ్గేది లేదు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రాష్ట్రంలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే టీజీబీసీఎల్ కు సరఫరా చేస్తున్న కంపెనీలు, కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలని చెప్పారు. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో కట్టుదిట్టంగా ఉండాలని అప్రమత్తం చేశారు. కొత్త కంపెనీల నుంచి అప్లికేషన్లకు తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజులు నిర్ణీత గడువు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆ కంపెనీలు తమ బ్రాండ్ల పేర్లతో దరఖాస్తు చేసుకోవాలని, ఆ కంపెనీల నాణ్యత ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు.

yearly horoscope entry point

సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల యునైటెడ్ బెవరేజస్ కంపెనీ బీర్ల రేట్లను 33.1 శాతం పెంచాలని ఒత్తిడి చేసిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదని, పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న బీర్ల ధరలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ నివేదిక ఆధారంగా ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. గత ఏడాదిగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో కేఎఫ్ బీర్ల సరఫరా నిలిపివేత

యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి చేసే కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లను తెలంగాణలో సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 30కి అనుగుణంగా... తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీబీసీఎల్) కి తన బీర్ల సరఫరాను తక్షణమే నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించిందింది.

టీజీబీసీఎల్...తన కంపెనీ బీర్ ప్రాథమిక ధరను 2019-20 నుంచి సవరించలేదని తెలిపింది. దీని ఫలితంగా తెలంగాణలో భారీ నష్టాలు చవిచూశామని పేర్కొంది. దీంతో పాటు గతంలో సరఫరా చేసిన బీర్లకు టీజీబీసీఎల్ చెల్లించాల్సిన బకాయిలు భారీగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఈ కారణాలతో తెలంగాణలో తమ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

గత బకాయిలు, ధరల పెరుగుదలతో...తమ కంపెనీ వస్తున్న నష్టాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. తెలంగాణ నుంచి రావాల్సిన గత రెండు త్రైమాసిక బకాయిలు రూ. 900 కోట్లు అని యూబీఎల్ పేర్కొంది. పండుగ సీజన్‌, మరో త్రైమాసిక అమ్మకాలతో తెలంగాణ నుంచి రూ.1000 కోట్లకు పైగా బకాయిలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం