TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు తొలుత వారికే..! గదుల నిర్మాణంపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్-cm revanth reddy review on indiramma housing scheme policy ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు తొలుత వారికే..! గదుల నిర్మాణంపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

TG Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్లు తొలుత వారికే..! గదుల నిర్మాణంపై గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 29, 2024 07:47 PM IST

ఇందిరమ్మ ఇండ్లపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇండ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై చర్చించారు. ల‌బ్ధిదారు ఆస‌క్తి చూపితే అద‌న‌పు గ‌దుల నిర్మాణానికి అనుమ‌తి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌క్ర‌మం ఎంచుకోవాల‌ని దిశానిర్దేశం చేశారు.

ఇందిర‌మ్మ ఇళ్లపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్పష్టం చేశారు. ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

ఇందిర‌మ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌న్నారు. ఏ ద‌శ‌లోనూ ల‌బ్ధిదారుకు ఇబ్బంది క‌ల‌గ‌వ‌ద్ద‌ని.. అదే స‌మ‌యంలో శాఖ‌ప‌రంగా ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌కుండా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించి ప్ర‌త్యేక కోటా ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు.

అలాంటి వారికి అనుమతి - సీఎం రేవంత్ ఆదేశాలు

ఇందిర‌మ్మ ఇళ్ల‌కు అద‌నంగా గ‌దులు నిర్మించుకునేందుకు ల‌బ్ధిదారులు ఆస‌క్తి చూపితే అందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం స‌మ‌ర్థమంతంగా కొన‌సాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బ‌లోపేతం కావాల‌ని దిశానిర్దేశం చేశారు. ఇందుకు అవ‌స‌ర‌మైన అధికారులు, సిబ్బందిని నియ‌మించుకోవాల‌ని శాఖ ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ స‌మీక్ష‌లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం