CM Revanth Reddy : మార్చి నెలాఖరుకు మూడు మెట్రోల డీపీఆర్ లు పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు-cm revanth reddy ordered official complete new metro routes dpr end of march ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : మార్చి నెలాఖరుకు మూడు మెట్రోల డీపీఆర్ లు పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy : మార్చి నెలాఖరుకు మూడు మెట్రోల డీపీఆర్ లు పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 07, 2025 09:44 PM IST

CM Revanth Reddy : ఫ్యూచర్ సిటీ, శామీర్ పేట్, మేడ్చల్ మెట్రో మార్గాలకు మార్చి నెలాఖరు నాటికి డీపీఆర్ లు సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు.

మార్చి నెలాఖరుకు మూడు మెట్రోల డీపీఆర్ లు పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
మార్చి నెలాఖరుకు మూడు మెట్రోల డీపీఆర్ లు పూర్తి చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

CM Revanth Reddy : ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చల్ మెట్రో మార్గాల‌కు సంబంధించిన డీపీఆర్ లు మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది ఏప్రిల్ నెలాఖ‌రుకు టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్తర‌ణ‌, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల‌పై త‌న నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వహించారు.

yearly horoscope entry point

ఎలివేటెడ్ కారిడార్లు

రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయం-ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్‌-శామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యార‌డైజ్-మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల విష‌యంలో భ‌విష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకోవాల‌న్నారు. ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే క్షేత్ర స్థాయిలో స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాల‌న్నారు. మేడ్చల్ మార్గంలో ఎన్‌హెచ్

మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాల‌ని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వర‌గా ప్రారంభించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

అన్ని సౌకర్యాలతో జంక్షన్

శామీర్‌పేట్‌, మేడ్చల్ మెట్రోలు ఒకేచోట ప్రారంభ‌మయ్యేలా చూసుకోవాల‌ని... అక్కడ అధునాతన వ‌స‌తులు, భ‌విష్యత్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. ఆయా ప్రాంతాల వారు ప్రతి ప‌నికి న‌గ‌రంలోకి రాన‌వ‌స‌రం లేకుండా అక్కడే అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉండేలా ఆ జంక్షన్‌ను అభివృద్ధి చేయాల‌న్నారు. జంక్షన్‌కు సంబంధించిన పూర్తి ప్రణాళిక‌ను త‌యారు చేయాల‌ని సీఎం ఆదేశించారు. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్‌) కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు.

Whats_app_banner

సంబంధిత కథనం