CM Revanth On Traffic Issues : వానాకాలం సీజన్ ఇబ్బందులపై సీఎం రేవంత్ సమీక్ష - హోంగార్డుల రిక్రూట్‌ కు గ్రీన్ సిగ్నల్-cm revanth reddy instructed officials to take measures to prevent traffic issues through physical policing methods ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth On Traffic Issues : వానాకాలం సీజన్ ఇబ్బందులపై సీఎం రేవంత్ సమీక్ష - హోంగార్డుల రిక్రూట్‌ కు గ్రీన్ సిగ్నల్

CM Revanth On Traffic Issues : వానాకాలం సీజన్ ఇబ్బందులపై సీఎం రేవంత్ సమీక్ష - హోంగార్డుల రిక్రూట్‌ కు గ్రీన్ సిగ్నల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 16, 2024 06:26 AM IST

CM revanth Reddy Latest News : వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ఆయన.. పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి
కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి

CM revanth Reddy : హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

yearly horoscope entry point

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలని దిశానిర్దేశం చేశారు. సిబ్బంది కొరత ఉంటే హోమ్ గార్డులను రిక్రూట్‌ చేసుకోవాలని సూచించారు.

ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటిని వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. నగరంలో వరద తీవ్రత ఉండే 141 ప్రాంతాలను గుర్తించినట్టు ఈ సందర్భంగా అధికారులు వివరించారు.

వరద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టంతో పాటు నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో పాటు డీజీపీ రవి గుప్తా ఉన్నారు.

Whats_app_banner