Yadadri Temple : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. యాదాద్రి పేరు మార్పు.. ఇక నుంచి..-cm revanth reddy changes the name of yadadri to yadagirigutta ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Temple : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. యాదాద్రి పేరు మార్పు.. ఇక నుంచి..

Yadadri Temple : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. యాదాద్రి పేరు మార్పు.. ఇక నుంచి..

Basani Shiva Kumar HT Telugu
Nov 08, 2024 03:06 PM IST

Yadadri Temple : సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి పేరును మార్చారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి రికార్డుల్లో యాదగిరిగుట్టగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట

యాదాద్రి పేరును మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. యాదాద్రి బదులు యాదగిరిగుట్టగా పేరు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై రికార్డుల్లో ఇదే కొనసాగించాలని సూచించారు. ఇక టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులకు స్పష్టం చేశారు సీఎం రేవంత్. టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఉండేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి అధ్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.

గోశాలలో గోసంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీని తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గోసంరక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. గతంలో కొండపై నిద్ర చేసేందుకు భక్తులకు అవకాశం ఉండేదని గుర్తుచేసిన సీఎం.. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులను మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. మరో వారంరోజుల్లో పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలని అదేశించారు.

ఆలయానికి సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తిస్థాయి రిపోర్ట్ అందించాలని చెప్పారు. ఇకనుంచి యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Whats_app_banner