Telangana Assembly Sessions : దమ్ముంటే కేసీఆర్ ను సభకు తీసుకురండి, చర్చిద్దాం - బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్-cm revanth reddy challenge to kcr and brs mlas over irrigation projects in telangana assembly session 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Revanth Reddy Challenge To Kcr And Brs Mlas Over Irrigation Projects In Telangana Assembly Session 2024

Telangana Assembly Sessions : దమ్ముంటే కేసీఆర్ ను సభకు తీసుకురండి, చర్చిద్దాం - బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ సవాల్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 14, 2024 12:25 PM IST

Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేసీఆర్ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

Telangana Assembly Budget Session 2024: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వేదికగా కేసీఆర్ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రిగా ఉన్న తనపై అసభ్య పదజాలంతో దూషించటమేంటని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ లోని వాస్తవాలను చూపించేందుకు ఎమ్మెల్యేలను తీసుకెళ్తే… కేసీఆర్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని సూటిగా ప్రశ్నించారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని… ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఏ విధంగా మేలు చేయాలనే దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కానీ కేసీఆర్ వీధి నాటకాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేడిగడ్డతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులపై సభలో చర్చిద్దామని… దమ్ముంటే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ను తీసుకురావాలని సవాల్ విసిరారు.

ట్రెండింగ్ వార్తలు

మేడిగడ్డ మేడిపండులాగా మారిపోయింది. నీళ్లు నింపే అవకాశం ఉందా అసలు…? మేడిగడ్డ నుంచి ఎలా నీటిని ఎలా అన్నారానికి ఎత్తిపోస్తారో కేటీఆర్, హరీశ్ రావు చెప్పాలి. పూర్తిగా ప్రాజెక్ట్ దెబ్బతిన్నది. ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అయ్యాయి. వీటిపై సమాధానాలు చెప్పలేక… సభకు రాకుండా కేసీఆర్ ఉంటున్నారు. చర్చకు సిద్ధమైతే కేసీఆర్ ను పిలవండి. రేపు సాయంత్రం వరకైనా కాళేశ్వరంపై చర్చ చేయడానికి సిద్ధం. ప్రతిపక్ష బాధ్యతలను తప్పించుకునేందుకు ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. కేసీఆర్ ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకు లేదు. సానుభూతి కోసం వీల్ చైర్, వీధి నాటకాలు చేస్తున్నారు” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

కడియం వర్సెస్ కోమటిరెడ్డి

సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య డైలాగ్ వార్ నడిచింది. బడ్జెట్ పై కడియం మాట్లాడుతూ... దళితబంధు, నిరుద్యోగ భృతితో పాటు రాజముద్రలో మార్పులు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని... కానీ అలా చేయలేరని అన్నారు. ఈ బడ్జెట్ లో కీలక అంశాలను ప్రస్తావించలేదని విమర్శించారు. ఇందుకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... కడియంపై విమర్శలు గుప్పించారు. రెండురోజుల కింద సభలో కడియం మాట్లాడుతూ... తనకు మంత్రి పదవి రాదు అంటూ మాట్లాడరని గుర్తు చేశారు. తనకు పదవి వస్తుందా రాదా అనేది మా పార్టీ నిర్ణయిస్తుందని... కడియంకు అవసరమేంటని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొని.... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తాటికొండ రాజయ్యకు మోసం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని దుయ్యబట్టారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆ పదవిని తీసుకున్న వ్యక్తి కడియం శ్రీహరి అని చెప్పారు. రాజయ్య సిట్టింగ్ సీటును కూడా కొట్టేశారని అన్నారు. ఇందుకు కౌంటర్ గా కడియం శ్రీహరి మాట్లాడారు. అసలు కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో మోసం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఇరువురి మధ్య వాదన సాగుతుండగా... మంత్రి శ్రీధర్ బాబు కలగజేసుకున్నారు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని సూచించారు.

IPL_Entry_Point