Telangana Govt : కేసుల ఎత్తివేత, ఉచితంగా సోలార్ పంపు సెట్లు - ఆదివాసీల‌పై సీఎం రేవంత్ వ‌రాల జ‌ల్లు-cm revanth reddy announced that the movement cases filed against the adivasis will be dropped ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Govt : కేసుల ఎత్తివేత, ఉచితంగా సోలార్ పంపు సెట్లు - ఆదివాసీల‌పై సీఎం రేవంత్ వ‌రాల జ‌ల్లు

Telangana Govt : కేసుల ఎత్తివేత, ఉచితంగా సోలార్ పంపు సెట్లు - ఆదివాసీల‌పై సీఎం రేవంత్ వ‌రాల జ‌ల్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 10, 2025 06:32 PM IST

ఆదివాసీల‌పై పెట్టిన ఉద్య‌మ కేసులు ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.ఆదివాసీ విద్యార్థుల‌కు వంద శాతం ఓవ‌ర్‌షిప్ స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తామన్నారు. ప్ర‌తి నాలుగు నెల‌ల‌కోసారి నాయ‌కుల‌తో స‌మావేశం ఉంటుందని.. సాగుకు ఉచితంగా సోలార్ పంపు సెట్లు అందజేస్తామని చెప్పారు.

ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ సమీక్ష
ఆదివాసీ సంఘాలతో సీఎం రేవంత్ సమీక్ష

రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

yearly horoscope entry point

ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆదివాసీల కోసం ఇప్పటికే చేపట్టిన పలు విషయాలను ప్రస్తావిస్తూ… వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

కొమురం భీమ్ జయంతి, వర్ధంతిలను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఐటీడీఏ ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్ డ్రైవ్ కింద ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మరికొన్ని నిర్ణయాలివే…

  • "ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలి. అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయడం వంటి చర్యలు ఇప్పటికే తీసుకున్నాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నాం. అలాగే ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం.
  • ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించడం, గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలి. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
  • విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్ షిప్పులకు సంబంధించి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. ఇప్పటికే మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి.
  • ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి నివేదిక తయారు అందించాలి. కెస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలి. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి." అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం