CM KCR | ముంబై పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌-cm kcr left to mumbai to meer maharashra cm uddhav thackeray ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr | ముంబై పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

CM KCR | ముంబై పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్‌

HT Telugu Desk HT Telugu

ముంబై పర్యటనలో భాగంగా ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేతోపాటు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌తోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ కానున్నారు.

ప్రత్యేక విమానంలో ఎంపీ రంజిత్ రెడ్డితో సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ముంబై బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట ఎంపీలు సంతోష్‌కుమార్‌, రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్‌ ప్రధాన కార్యదర్శి శ్రవణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నారు. 

ఈ పర్యటనలో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేతోపాటు నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ శరద్‌ పవార్‌తోనూ సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత, భవిష్యత్‌ రాజకీయ పరిణామాలపై వారితో చర్చించనున్నారు. సీఎం రాకను పురస్కరించుకొని శనివారమే ముంబై నగరంలో పెద్ద ఎత్తున కేసీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దేశ్ కీ నేతా అంటూ కేసీఆర్ తోపాటు ఆయనకు మద్దతుగా నిలిచిన నేతల ఫొటోలను ఈ ఫ్లెక్సీల్లో ఉంచారు.

సంబంధిత కథనం