కేసీఆర్ సంగారెడ్డి టూర్: సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సీఎం
ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. నారాయణఖేడ్ పట్టణ శివారులో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
Sangareddy | నిన్న ముంబై పర్యటన ముగించుకొని వచ్చిన సీఎం కేసీఆర్, మళ్లీ యధావిధిగా జిల్లాల పర్యటనల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, ఆందోల్ నియోజవకవర్గాల్లోని 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.4,427 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనుంది.
సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రం నుంచి హెలికాప్టర్ ద్వారా నారాయణఖేడ్ చేరుకున్న సీఎం కేసీఆర్, శివారు ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శిలాఫలకం ఆవిష్కరించారు. సీఎంతో పాటు మంత్రి హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్ నారాయణఖేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
Minister Harish Rao Tweet:
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టుల ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి
జహీరాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాలలో దాదాపు 3,90,000 ఎకరాలకు సాగు నీరు అందించడానికి మొత్తం రూ. 4,427 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఒక్కో ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాలు ఇలా ఉన్నాయి.
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్
నిధులు - రూ. 2653 కోట్లు
ఆయకట్టు - 2.19 లక్షల ఎకరాలు
పంప్ హౌజులు - 3
లిప్టు ఎత్తు - 147 మీటర్లు
విద్యుత్తు వినియోగం - 140 మెగావాట్లు
కాల్వల దూరం - 206.40 కి.మీ
కాల్వలు
రాయికోడ్ కెనాల్ - 56.85 కి.మీ
మునిపల్లి కెనాల్ - 11.40 కి.మీ
కంది కెనాల్ - 44.85 కి.మీ
జహీరాబాద్ కెనాల్ - 30.95 కి.మీ
గోవిందాపూర్ కెనాల్ - 19.15 కి.మీ
హద్నూర్ కెనాల్ - 51.80 కి.మీ
ఆయకట్టు వివరాలు
1. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 115 గ్రామాల్లోని 1,03,259 ఎకరాలు
2. ఆందోల్ నియోజకవర్గంలో రెండు మండలాల పరిధిలోని 66 గ్రామాల్లో 65,816 ఎకరాలు
3. సంగారెడ్డి నియోజకవర్గం నాలుగు మండలాల పిరధిలోని 50 గ్రామాల్లోని 50 గ్రామాల్లోని 49,925 ఎకరాలు
బసవేశ్వర ఎత్తిపోతల పథకం
నిధులు - రూ. 1774 కోట్లు
ఆయకట్టు - 1.65 లక్షల ఎకరాలు
పంప్ హౌజులు - 2
లిప్టు ఎత్తు - 59.75 మీటర్లు
విద్యుత్తు వినియోగం - 70 మెగావాట్లు
కాల్వల దూరం - 160.10 కి.మీ
కాల్వలు
*కరస్ గుత్తి కెనాల్ - 88.20 కి.మీ
కసర్ గుత్తి బ్రాంచి కెనాల్ - 25.80 కి.మీ
వట్ పల్లి కెనాల్ - 20 కి.మీ
నారయణఖేడ్ కెనాల్ - 20కి.మీ
రేగోడ్ కెనాల్ - 12.90 కి.మీ
కంగ్గి కెనాల్ - 16.80 కి.మీ
అంతర్ గావ్ కెనాల్ - 16.40 కి.మీ
ఆయకట్టు వివరాలు
1. నారాయణఖేడ్ నియోజకవర్గం ఆరు మండలాల పరిధిలో 130 గ్రామాల్లోని 1,31,000 ఎకరాలు
2. ఆందోలు నియోజకవర్గంలో రెండు మండలాలు పరిధిలోని 36 గ్రామాల్లో 34,000 ఎకరాలు
సంబంధిత కథనం