BRS Party : 'అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్'.. బీఆర్ఎస్ నినాదం, జెండా ఇవే…-cm kcr hoists brs party new flag at telangana bhavan hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Cm Kcr Hoists Brs Party New Flag At Telangana Bhavan Hyderabad

BRS Party : 'అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్'.. బీఆర్ఎస్ నినాదం, జెండా ఇవే…

Dec 09, 2022, 03:55 PM IST HT Telugu Desk
Dec 09, 2022, 03:55 PM , IST

  • BRS Party Official Flag: టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారింది. ఎన్నికల సంఘం ఆమోదం, కేసీఆర్ సంతకంతో భారత రాష్ట్ర సమితిగా అవతరించింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ జెండా, నినాదాన్ని కూడా ప్రకటించారు. 

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన  జెండాను ఆవిష్కరించారు కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

(1 / 5)

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన  జెండాను ఆవిష్కరించారు కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. (twitter)

జెండా ఆవిష్క‌రణ కంటే ముందు బీఆర్ఎస్ ప‌త్రాల‌పై కేసీఆర్ సంత‌కం చేశారు. అంత‌కు ముందు ముందు భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కుమారస్వామికి బీఆర్ఎస్ కండువా కప్పారు కేసీఆర్.

(2 / 5)

జెండా ఆవిష్క‌రణ కంటే ముందు బీఆర్ఎస్ ప‌త్రాల‌పై కేసీఆర్ సంత‌కం చేశారు. అంత‌కు ముందు ముందు భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కుమారస్వామికి బీఆర్ఎస్ కండువా కప్పారు కేసీఆర్.(twitter)

భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. 

(3 / 5)

భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో జేడీఎస్ చీఫ్ కుమార స్వామి, సినీ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్, ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయ‌కులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. (twitter)

అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని స్పష్టం చేశారు కేసీఆర్. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని వ్యాఖ్యానించారు.

(4 / 5)

అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని స్పష్టం చేశారు కేసీఆర్. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని వ్యాఖ్యానించారు.(twitter)

ఈనెల 14 వ తేదీన ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని భారత్ రాష్ట్ర సమితి [బీఆర్ఎస్] జాతీయ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు. జాతీయ కార్యదర్శుల నియామకంపై ప్రకటన రానుంది.

(5 / 5)

ఈనెల 14 వ తేదీన ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని భారత్ రాష్ట్ర సమితి [బీఆర్ఎస్] జాతీయ కార్యాలయం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  త్వరలోనే బీఆర్ఎస్ జాతీయ కార్యవర్గం ఏర్పాటు. జాతీయ కార్యదర్శుల నియామకంపై ప్రకటన రానుంది.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు