Hyderabad Metro : నెరవేరుతున్న కల.... శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్-cm kcr ground breaking for samshabad metro express works today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Ground Breaking For Samshabad Metro Express Works Today

Hyderabad Metro : నెరవేరుతున్న కల.... శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్

HT Telugu Desk HT Telugu
Dec 09, 2022 08:52 AM IST

Hyderabad Metro భాగ్యనగరంలో ట్రాఫిక్ చిక్కులతో చుక్కలు చూపిస్తోన్న ఎయిర్‌ పోర్ట్‌ ప్రయాణానికి త్వరలోనే పరిష్కారం లభిస్తోంది. హైదరాబాద్‌ మెట్రో నెట్‌‌వర్క్‌ను శంషాబాద్‌ విమానాశ్రయంతో అనుసంధానించాలని నిర్ణయించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ భవిష్యత్తు రవాణా అవసరాలను తీర్చడంతోపాటు శంషాబాద్ విమానాశ్రయానికి అతి తక్కువ సమయంలో చేరుకునేలా మెట్రో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సిఎం కేసీఆర్‌ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ కారిడార్‌ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో ఎక్స్‌ప్రెస్
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో ఎక్స్‌ప్రెస్

Hyderabad Metro ఎయిర్‌ పోర్ట్‌ ఎక్స్ ప్రెస్ మెట్రో కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు శంకుస్థాపన చేయనున్నారు. మైండ్ స్పేస్ ఐకియా జంక్షన్ దగ్గర ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన తర్వాత అప్పా పోలీసు అకాడమీ దగ్గర బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు రానుంది. 6250 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వమే మెట్రోరైలు నిర్మాణానికి చేపట్టింది. మొత్తం 31 కిలోమీటర్ల మేర మెట్రోరైలు రెండవ దశ పూర్తి కానుంది. మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెట్రో నిర్మాణం పూర్తైతే హైదరాబాద్ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి 26నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ప్రయాణికులకు మెట్రో కారిడార్‌లోనే విమానాశ్రయ ప్రయాణాలకు చెక్‌ ఇన్‌ చేసుకోవచ్చు. తద్వారా విమానాశ్రయాల్లో రద్దీని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

మెట్రో ఎక్స్‌ ప్రెస్‌ కారిడార్‌లో విమానాశ్రాయానికి వెళ్లే ప్రయాణాకులతో పాటు హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. సబ్ అర్బన్ ప్రాంతాల్లో మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడానికి మెట్రో కారిడార్‌ ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్ారు. ఏరోస్పేస్ ఆదిభట్ల, ఫార్మాసిటీ వంటి ప్రాంతాలకు మెరుగైన రవాణ సదుపాయం అందుబాటులోకి వస్తుంది.

ప్రపంచంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో విమానాశ్రయానికి మెట్రో రైలు సౌకర్యం కూడా ఉంది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దార్శనికత నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మెట్రో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులతో భారీగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలో విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మెట్రో ప్రాజెక్టు వల్ల హైదరాబాద్ మరిన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హైదరాబాద్‌లో రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లు, లింక్ రోడ్లు మరియు ఇతర రహదారి వ్యవస్థలను బలోపేతం చేస్తోంది. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో కారిడార్‌ను విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శుక్రవారం ఉదయం ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. వచ్చే మూడేళ్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని సీఎం చెప్పారు.ఈ మెట్రో బయోడైవర్సిటీ జంక్షన్, కాజాగూడ రోడ్డు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నానక్ రామ్‌గూడ జంక్షన్‌ను తాకుతుంది. మెట్రో రైలు విమానాశ్రయం నుండి ప్రత్యేక మార్గం ద్వారా నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు రూ.6,250 కోట్లతో మొత్తం 31 కిలోమీటర్ల పొడవున ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ మార్గంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తున్నాయి.

IPL_Entry_Point

టాపిక్