KCR Karimnagar Visit : కరీంనగర్‌లో పెళ్లికి కేసీఆర్.. ఛైర్మన్ పదవి గిఫ్ట్!-cm kcr attend karimnagar former mayor ravinder singh daughter marriage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Attend Karimnagar Former Mayor Ravinder Singh Daughter Marriage

KCR Karimnagar Visit : కరీంనగర్‌లో పెళ్లికి కేసీఆర్.. ఛైర్మన్ పదవి గిఫ్ట్!

HT Telugu Desk HT Telugu
Dec 08, 2022 05:57 PM IST

CM KCR In Karimnagar : సీఎం కేసీఆర్ కరీంనగర్ వెళ్లారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత మంత్రి గంగుల ఇంటికి కూడా వెళ్లారు.

రవీందర్ సింగ్ కుమార్తె పెళ్లికి కేసీఆర్
రవీందర్ సింగ్ కుమార్తె పెళ్లికి కేసీఆర్ (twitter)

కరీంనగర్(Karimnagar)లో మాజీ మేయర్ రవీందర్ సింగ్(Ravinder Singh) కుమార్తె వివాహానికి సీఎం కేసీఆర్(CM KCR) హాజరు అయ్యారు. నవదంపతులను ఆశీర్వదించారు. వారితో కలిసి ఫొటోలు దిగారు. అంతకుముందు.. హెలికాప్టర్‌లో ఎర్రవల్లి నుంచి కేసీఆర్ కరీంనగర్ చేరుకున్నారు. ప్రత్యేక వాహనంలో వివాహానికి హాజరయ్యారు. కేసీఆర్‌(KCR)కు హెలిప్యాడ్ వద్ద మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్(Gangula Kamalakar) స్వాగతం పలికారు. టీఆర్ఎస్(TRS) నేతలు కేసీఆర్ ను కలిసేందుకు ఎగబడ్డారు. పెళ్లికి హాజరు అయిన తర్వాత అక్కడ నుంచి మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి వెళ్లారు కేసీఆర్. తేనిటి విందు స్వీకరించి.. కాసేపు మాట్లాడుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

అయితే కరీంనగర్ మాజీ మేయర్(Karimnagar Former Mayor) రవీందర్ సింగ్ కుమార్తె వివాహానికి వెళ్లిన కేసీఆర్ ఓ గిఫ్ట్ ఇచ్చారు. రవీందర్ సింగ్ ను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. పెళ్లికి వెళ్లి.. కేసీఆర్ ఛైర్మన్ పదవి గిఫ్ట్ ఇచ్చారని జనాలు మాట్లాడుకుంటున్నారు.

కాంగ్రెస్ శ్రేణుల నిరసన

కేసీఆర్ కరీంనగర్ కు వస్తున్నారని తెలిసి.. కాంగ్రెస్(Congress) శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. పోలీసు(Police)లు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్​కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. నెరవేర్చిన తర్వాతే ఈ గడ్డపై అడుగుపెట్టాలని కాంగ్రెస్​ పార్టీ నేత కోమటిరెడ్డి నరేందర్​ రెడ్డి అన్నారు.

కేసీఆర్ పర్యటన(KCR Tour) సందర్భంగా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు అప్రమత్తమై.. కొంతమందిని ముందస్తు అరెస్టు చేశారు. గంగుల ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ లీడర్లను బయటకు రాకుండా పోలీసులు కట్టడి చేశారు. కేసీఆర్ నియంతలా పాలన చేస్తున్నారని.. ఈ సందర్భంగా కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. మరోవైపు జగిత్యాల జిల్లా అల్లీపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బండలింగాపూర్ గ్రామాన్ని మండలంగా చేస్తున్నామని కేసీఆర్(KCR) ప్రకటనతో అల్లీపూర్ గ్రామస్థులు నిరసన తెలిపారు. పోలీసులు నచ్చజెప్పి విరమింపజేశారు.

IPL_Entry_Point