Revanth On Bureaucrats: ట్రైనింగ్‌లోనే సివిల్‌ పంచాయితీలా! ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల తీరుపై సీఎం రేవంత్ చురకలు-civil panchayats in training revanth comments on the behavior of ias and ips officers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth On Bureaucrats: ట్రైనింగ్‌లోనే సివిల్‌ పంచాయితీలా! ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల తీరుపై సీఎం రేవంత్ చురకలు

Revanth On Bureaucrats: ట్రైనింగ్‌లోనే సివిల్‌ పంచాయితీలా! ఐఏఎస్‌,ఐపీఎస్‌ అధికారుల తీరుపై సీఎం రేవంత్ చురకలు

Sarath Chandra.B HT Telugu
Published Feb 17, 2025 08:45 AM IST

"Revanth On Bureaucrats: శిక్షణలో ఉండగానే కొందరు అధికారులు సివిల్‌ పంచాయితీలు చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి చురకలు వేశారు. గతంలో ప్రజాప్రతినిధులు ఏదైనా ప్రస్తావిస్తే... అధికారులు లోటుపాట్లను విశ్లేషించేవారని కానీ ఇప్పుడేమో.. ఒక తప్పు చేద్దా మంటే మూడు చేద్దామనే అధికారులను చూస్తున్నారు.

పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ కామెంట్స్
పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్‌ కామెంట్స్

"Revanth On Bureaucrats: కొత్తగా ఎంపికైన ఐపీఎస్‌ అధికారుల్లో కొందరు శిక్షణలో ఉన్న సమయంలోనే యూనిఫామ్ వేసుకొని మరీ ప్రైవేటు పంచాయితీలు చేస్తు న్నారని ఈ ధోరణి సమాజానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమందిలోనైనా మార్పు రావాలని బహిరంగంగా ఈ విషయం చెబుతున్నానని, గతంలో ప్రజా ప్రతినిధులు ఏదైనా చెబితే అందులో తప్పొప్పులు విశ్లేషించేవారని, ఇప్పడు ఒకటికి మూడు తప్పులు చేయడానికి కొందరు ఉన్నారన్నారు.

రిటైర్డ్ ఐఏఎస్ గోపాలక్రిష్ణనాయుడి స్వీయచరిత్ర పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. అధికారుల్లో చాలామంది ఏసీ గదులు దాటి వెళ్లట్లేదని, క్షేత్రస్థాయిలో పనిచేయాలంటున్నా కొందరు అధికారులు వినట్లేదని, వారితీరు అసంతృప్తిగా ఉందని వారి తీరు మారాలన్నారు. నిబద్ధతతోనే గుర్తింపు వస్తుందని చెప్పారు.

నాయకులు వస్తుంటారు.. పోతుంటారని ఏళ్ల తరబడి ప్రజలకుే సేవలందించే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల సమస్యలను పరిష్క రిస్తూ.. జనం ప్రయోజనాల కోసం ఆలోచించాల్సిన అవసరం ఉందిని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. నోట్‌ ఫైల్‌ సిద్ధం చేయడానికే పరిమితం కాకుండా రాజ కీయ నాయకుల ఆలోచనలు అందులో మంచి చెడులను విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

సమస్యలను పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న అధికారులు ప్రజల మనసుల్లో ఎక్కువ కాలం గుర్తుంటారని చెప్పారు.

లైఫ్ ఆఫ్ కర్మ యోగి…

ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ గారు రాసిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి’ (Life of a Karma Yogi) పుస్తకాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...

"గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారని ఆ కారణంగానే రాజకీయ నాయకుల కంటే అధికారులనే ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకునే వారన్నారు. ముఖ్యంగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కానీ కొందరు కలెక్టర్లు ఏసీ రూములను వదిలి బయటకు వెళ్లడం లేదని కలెక్టర్లు, ఎస్పీలకు జిల్లా స్థాయిలో గడించే అనుభవమే కీలకమవుతుందన్నారు.

అధికారుల్లో మార్పు రావలసిన అవసరం ఉందని నిబద్ధత కలిగిన అధికారులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. రాజకీయ నాయకులు నిర్ణయాలు చేసినప్పుడు వాటిలోని అంశాలను విశ్లేషించి వివరించాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని బిజినెస్ రూల్స్ వివరించాలి. కొందరు వాటిని విస్మరిస్తున్నారని అది సమాజానికి మంచిది కాదు. అధికారుల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలన్నారు.

శంకరన్ ఆదర్శం…

ఎంతో నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ , పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్ గారు, దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ లాంటి వారి అనుభవాల నుంచి కొత్తగా సర్వీసులో చేరుతున్న సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు.

ఆరు దశాబ్దాల అనుభవాన్ని ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. మనం ఏదైనా కొనొచ్చు. కానీ అనుభవాన్ని కొనలేం. సివిల్ సర్వెంట్స్ అందరికీ గోపాలకృష్ణ గారి పుస్తకం వెలకట్టలేనిది. అందరికీ ఒక దిక్సూచిగా ఉంటుందన్నారు.

తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారి కాలం నుంచి నేటి ప్రధాని మోదీ గారి వరకు అనుభవం కలిగిన గోపాలకృష్ణ గారు.. క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు దేశంలో మార్పులకు ప్రత్యక్ష సాక్షి. భవిష్యత్తును కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు" అని వివరించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, అసోసియేషన్ వైస్-ప్రెసిడెంట్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు గారితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner