Jani Master Case : జానీ మాస్టర్ కు బిగ్ షాక్, లైంగిక వేధింపులు నిజమేనని పోలీసుల నిర్థారణ
Jani Master Case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో నార్సింగి పోలీసులు రిమాండ్ రిపోర్టు దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజమేనని నిర్థారించారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్లు పోలీసులు నిర్థారించారు.
Jani Master Case : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నార్సింగ్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు నిర్థారించారు. ఈవెంట్ల పేరులో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెను లైంగికంగా వేధించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొ్న్నారు. ఈ కేసులో జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే.
హైకోర్టు బెయిల్
జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. హైకోర్టు జానీమాస్టర్ కు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25న చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పోలీసులు జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేయడంతో ఆయన నేషనల్ అవార్డును కోల్పోయారు.
జానీ మాస్టర్ తనపై లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 16న నార్సింగి పోలీసులు 376, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. కోర్టు ఆయకు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలులో 36 రోజులు పాటు ఉన్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగిసిన తర్వాత ఆయన మళ్లీ జైలుకు వెళ్లారు. పోక్సో కేసు కారణంగా జానీ మాస్టర్ జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేసింది.
రెగ్యులర్ బెయిల్ కోసం పోక్సో కోర్టులో దాఖలు చేసిన పిటిషనన్‌ను అక్టోబర్ 14న కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టు ఆశ్రయించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను హైదరాబాద్ పోలీసులు సెప్టెంబర్ 20న అదుపులోకి తీసుకున్నారు. గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి జానీ మాస్టర్‌ను నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. అవుట్ డోర్ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది.
శ్రీతేజ్ ను పరామర్శించిన జానీ మాస్టర్
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ను కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను ఆడిగి తెలుసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ ను పరామర్శించాలని సినీ పరిశ్రమకు చెందిన చాలామందికి ఉందని, కానీ కొన్ని పరిధులు కారణంగా రాలేకపోతున్నారని జానీ మాస్టర్ అన్నారు. డ్యాన్సర్ యూనియన్ తరఫున శ్రీతేజ్‍కు సాయం అందిస్తామని చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని, అతడు త్వరలోనే కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అతని కుటుంబానికి సినీ పరిశ్రమ అండగా ఉంటుందన్నారు. ఈ మేరకు శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పామన్నారు.
ఈ ఘటన తర్వాత తాను అల్లు అర్జున్‌ను కలవలేదన్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాని చెప్పారు. తనకు వచ్చే సాంగ్స్ రిహార్సల్స్ చేసుకుంటూ ఫ్యామిలీతో సమయం గడుపుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తన కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఏ విషయాలు మాట్లాడలేనన్నారు. అయితే కొందరు విలేకరులు...జానీ మాస్టర్ కేసు వెనుక అల్లు అర్జున్ ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయని ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందించలేదు. జానీ మాస్టర్ అరెస్టు సమయంలో అల్లు అర్జున్ పై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా మరో సమాధానం చెబుతూ తప్పించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
సంబంధిత కథనం