మ్యూటేషన్ కోసం రూ. 2 లక్షలు లంచం డిమాండ్…! ఏసీబీకి దొరికిపోయిన చిట్యాల ఎమ్మార్వో-chityal mandal mro krishna were caught by acb in in nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మ్యూటేషన్ కోసం రూ. 2 లక్షలు లంచం డిమాండ్…! ఏసీబీకి దొరికిపోయిన చిట్యాల ఎమ్మార్వో

మ్యూటేషన్ కోసం రూ. 2 లక్షలు లంచం డిమాండ్…! ఏసీబీకి దొరికిపోయిన చిట్యాల ఎమ్మార్వో

నల్గొండ జిల్లాలోని చిట్యాల మండల ఎమ్మార్వో ఏసీబీకి చిక్కాడు. రైతు నుంచి లంచం తీసుకుంటా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

ఏసీబీకి చిక్కిన చిట్యాల ఎమ్మార్వో

గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఎమ్మార్వోగా విధులు నిర్వర్తిస్తున్న గుగులోతు కృష్ణ ఏసీబీకి చిక్కారు. ఆయనతో పాటు మరో ప్రైవేట్ వ్యక్తిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

రూ. 2 లక్షలు తీసుకుంటూ

ఓ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి యొక్క మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి మరియు మరొక వ్యవసాయ భూమి యొక్క సర్వే నివేదికను సమర్పించేందుకు రూ. 2 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి… ఏసీబీని ఆశ్రయించాడు. రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. గట్టు రమేశ్ అనే ప్రైవేట్ వ్యక్తి కూడా పట్టుబడిన వారిలో ఉన్నాడు.

ఏ ప్రభుత్వాధికారి అయినా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. అవినీతి నిరోధక శాఖ "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని తెలిపారు. అంతే కాకుండా వివిధ సామాజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) లేదా వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని వివరించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం