Rat in Chutney: చట్నీలో చిట్టెలుక.. సంగారెడ్డి జేఎన్‌టియూ క్యాంపస్‌లో ఘటన, విద్యార్థుల ఆందోళన
Rat in Chutney: అల్పాహారం కోసం హాస్టల్ మెస్‌కు వెళ్లిన విద్యార్ధులకు చట్నీలో చిట్టెలుక విహరిస్తుండటం చూసి అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్‌టియూ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది.
Rat in Chutney: అల్పాహారం కోసం హాస్టల్ మెస్‌కు వెళ్లిన విద్యార్ధులకు చట్నీలో చిట్టెలుక విహరిస్తుండటం చూసి అవాక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్‌టియూ క్యాంపస్‌లో ఈ ఘటన జరిగింది.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ జేఎన్‌టియూ క్యాంపస్ మంగళవారం ఉదయం హాస్టల్ మెస్‌లో చట్నీలో ఎలుక కనిపించింది. ఉదయం కాలేజీ తరగతులకు వెళ్లే ముందు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో చట్నీ గిన్నెల్లో ఎలుక చక్కర్లు కొట్టడం చూసి విద్యార్ధులు ఖంగుతిన్నారు.
చట్నీ పాత్రపై ఎలాంటి మూత లేకపోవడంతో అందులో ఈదుకుంటూ బయటకు వచ్చేందుకు ఎలుక విశ్వప్రయత్నాలు చేసింది. హాస్టల్ మెస్ నిర్వాహకులు పారిశుధ్యం పాటించకపోవడంతోనే ఇలా జరిగిందని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.
నాలుగైదు రోజుల క్రితం విద్యార్ధులు భోజనం నాణ్యత పై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు విద్యార్ధుల్ని బయట నుంచి తెచ్చుకునే భోజనానికి కూడా భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. క్యాంపస్‌లోకి బయటి వారిని అనుమతించేది లేదని చెబుతున్నారు. మరోవైపు హాస్టల్లో నాసిరకం భోజనాలపై కాలేజీ యాజమాన్యం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. చట్నీలో ఎలుక ఈదుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.