TG Intermediate Exams: ఇంటర్ పరీక్షలకు నెలన్నర ముందు ప్రశ్నాపత్రాల్లో మార్పులు? ఇంటర్ బోర్డు వైఖరిపై విమర్శలు
TG Intermediate Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మరో నెలన్నరలో జరుగనుండగా పరీక్ష ప్రశ్నా పత్రాల్లో మార్పులు చేయాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించడంపై విద్యార్థులతో పాటు విద్యా సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
TG Intermediate Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ప్రశ్నా పత్రాలను మార్చాలని ఇంటర్ బోర్డు ప్రయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ప్రశ్నాపత్రాల విధానంలో మార్పులు చేస్తే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్ బోర్డు స్పష్టమైన ప్రకటన చేస్తుంది. దానికి భిన్నంగా పరీక్షలకు ముందు ప్రశ్నాపత్రం మార్చాలనుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

ఇంటర్ వార్షిక పరీక్షలకు మరో నెలన్న మాత్రమే గడువు ఉండగా ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లీష్ ప్రశ్నపత్రాల నమూనాలో మార్పు చేస్తున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల ప్రకటించింది. ఇప్పటి వరకు ఇంగ్లీష్ సబ్జెక్టులో మూడు సెక్షన్లుగా... 16 ప్రశ్నలు ఉండేవి.
ఈ ఏడాది మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పరీక్షలో ఒక ప్రశ్నను అదనంగా చేరుస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు సెక్షన్-సిలో ఒక ప్రశ్నకు 8 మార్కులు, మిగిలిన ప్రశ్నలకు నాలుగు మార్కులు ఉండేవి.
ప్రస్తుతం సి సెక్షన్‌లోని 8 మార్కుల ప్రశ్నను 4కి తగ్గించారు. కొత్తగా కలిపిన ప్రశ్నకు ఆ 4 మార్కులు కేటాయించారు. ఆ ప్రశ్నను మ్యాచ్ ది ఫాలోయింగ్ తరహా ప్రశ్నగా మార్చారు. దాంట్లోనూ 10 ఇస్తే 8కి మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కోదానికి అర మార్కు కేటాయిం చారు. కొత్తగా పరీక్షలకు ముందు ప్రశ్న పత్రాల విధానంలో మార్పు చేయడాన్ని విద్యార్ధులు, అధ్యాపకులు తప్పు పడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఈ మార్పులు అర్థం చేసుకోలేరని, పరీక్షలు సమీపిస్తుండంటతో కాలేజీలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుందని వారికి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. పరీక్షలకు ముందు ఇలాంటివి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో అంతు చిక్కడం లేదని చెబుతున్నారు.
ఇంటర్ బోరడ్ు ప్రతిపాదనలపై తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు, కళాశాలల ప్రిన్సిపాళ్లకు తెలపకుండా ఆంగ్ల పరీక్ష ప్రశ్నపత్రం విధానంలో మార్పు చేయడ మంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమేనని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహకరించుకోవాలని టీపీజేఎంఏ అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. జనవరి 17న ఇంటర్ బోర్డు పరీక్షల్లో మార్పులు చేసిందని దీని వల్ల విద్యార్థులు నష్టపోతారని తెలిపారు.
సంబంధిత కథనం