Hyderabad RRR Tenders : హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి బిగ్ బూస్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం-central govt invited tenders to hyderabad rrr north part construction completion in two years ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rrr Tenders : హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి బిగ్ బూస్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం

Hyderabad RRR Tenders : హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి బిగ్ బూస్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం

Bandaru Satyaprasad HT Telugu
Dec 28, 2024 10:46 PM IST

Hyderabad RRR Tenders : హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగంలో నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. రెండేళ్లలో సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మించాలి. రూ.5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారు.

హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి బిగ్ బూస్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి బిగ్ బూస్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం

Hyderabad RRR Tenders : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు గేమ్ చేంజర్ రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ఆర్ఆర్ఆర్ నార్త్ పార్ట్ లో నాలుగు లేన్ల ఎక్స్ ప్రెస్ రహదారి నిర్మాణ పనులకు కేంద్రం టెండర్ నోటీసులు విడుదల చేసింది. టెండర్ల ప్రకారం 2 సంవత్సరాలలో రహదారి నిర్మాణం పూర్తి చేయాలి. హైదరాబాద్ వెస్ట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ముందంజలో ఉంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోనుందని రియల్ వ్యాపారులు అంటున్నారు.

yearly horoscope entry point

కేంద్రం టెండర్లు

సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్‌ నుంచి యాదాద్రి వరకు ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. మొత్తం నాలుగు భాగాలుగా విభజించి రూ.5,555 కోట్లతో రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. రెండేళ్లలో ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రం నిబంధనల్లో తెలిపింది. సంగారెడ్డి జిల్లా గిర్మ్‌పూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు, రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ వరకు 26 కిలోమీటర్లు, ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు, సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవున ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది.

నాలుగు ప్యాకేజీల్లో

హైదరాబాద్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కి.మీ దూరం నుంచి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్‌ వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ ను మొత్తం నాలుగు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అధికారులు గుర్తించగా...ఇందులో 72.35 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి.

హైదరాబాద్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ సన్నద్ధమైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు 40 కి.మీ దూరం నుంచి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగాన్ని సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, చౌటుప్పల్‌ వరకు మొత్తం 161 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఆర్ఆర్ఆర్ ను మొత్తం నాలుగు ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం అవుతుందని అధికారులు గుర్తించగా...ఇందులో 72.35 హెక్టార్ల అటవీ భూములు ఉన్నాయి.

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్..... హైదరాబాద్ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి నిర్మిస్తున్న ఒక ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. సుమారు 346.320 కిలోమీటర్లు విస్తరణలో... నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టు చేపట్టు్నంది. ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం..ఎక్స్‌ప్రెస్ వే ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం. తూప్రాన్, గజ్వేల్, యాదాద్రి, చౌటుప్పల్, చింతపల్లి, నల్గొండ, ఆమన్‌గల్, షాద్‌నగర్, చేవెళ్ల, సంగారెడ్డి, నర్సాపూర్ వంటి పట్టణాలను కలుపుతున్న ఆర్ఆర్ఆర్ తో తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్ గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.

హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ చుట్టూ కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి రూపొందించిన ముఖ్యమైన మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైంది. కచ్చితమైన ప్రణాళికాబద్ధమైన ఎక్స్‌ప్రెస్‌వే 161-కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ (ORR) కంటే దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద ఔటర్ లూప్‌గా పనిచేస్తాయి. హైదరాబాద్ అభివృద్ధికి కొత్త కారిడార్‌ను సృష్టించడం ద్వారా వివిధ పట్టణాలు, పారిశ్రామిక కేంద్రాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం ద్వారా రవాణా నెట్‌వర్క్‌కు ఆర్ఆర్ఆర్ మూలస్తంభంగా మారనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం