తెలంగాణ సర్కార్ కు కేంద్రం షాక్… రుణ పరిమితిలో రూ.19 వేల కోట్ల కోత!
central govt cuts telangana loan limit: ఈ ఆర్థిక(2022-23) సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రానికి అందించే రుణాల్లో కోత విధించింది. తెలంగాణ సర్కార్ కోరిన రుణాల్లో దాదాపు రూ. 20,000 కోట్లను తగ్గించాలని నిర్ణయించింది.
central reduced telangana debt limit: తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర రుణ పరిమితిని తగ్గించాలని నిర్ణయించింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 20వేల కోట్ల కొరతను ఎదుర్కోనుంది. ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం.. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2020-21, 2021-22) భారీ బడ్జెట్-బడ్జెట్ రుణాలు తీసుకున్న నేపథ్యంలో రుణ పరిమితిని రూ. 20,000 కోట్ల మేర తగ్గించడం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బాండ్ల విక్రయం ద్వారా రూ.34,970 కోట్లను రాష్ట్ర అభివృద్ధి రుణంగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించింది.
Centre on FRBM limits: ఇక కేంద్ర ఆర్థికశాఖ ఈ ఏడాది నుంచి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ వెలుపల వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలనూ ఎఫ్‌ఆర్‌బీఎం రుణాల పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో రాష్ట్రం బాండ్ల విక్రయం ద్వారా తీసుకునే రుణాలు ఈ ఏడాది రూ.34,970 కోట్లకు పరిమితం కానున్నాయి. ఇప్పటికే మొదటి త్రైమాసికంలో జూన్ ఆఖరు వరకు రూ.7,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించి రుణం తీసుకోగా.. ఈ నెల నుంచి ప్రతి త్రైమాసికంలో రూ.9,000 కోట్ల చొప్పున రూ.27,000 కోట్ల బాండ్లను విక్రయించనుంది. బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర ఆర్థికశాఖ మార్చి 31న రాష్ట్రాలకు లేఖ రాసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కాకుండా అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలు భారీగా పెరుగుతుండటం, వాటిని బడ్జెట్‌ల నుంచి చెల్లిస్తుండటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో బడ్జెట్ వెలుపల తీసుకున్న రుణాలను ఈ ఏడాది రాష్ట్రాలు తీసుకునే ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి నుంచి మినహాయించనున్నట్లు పేర్కొంది. ఇక కేంద్ర తాజా నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ప్రత్యామ్నాయాలపై దృష్టి...
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయంపై సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది తీసుకునే రుణాల పరిమితిని కేంద్రం రూ.19 వేల కోట్ల మేర తగ్గించిన నేపథ్యంలో అదనపు నిధుల సమీకరణపై రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. పన్నులతో పాటు పన్నేతర ఆదాయం, భూముల అమ్మకం ద్వారా అదనపు రాబడి అంచనాల మేరకు వచ్చేలా చర్యలు తీసుకోనేలా కార్యాచరణను రూపొందించే పనిలో పడింది.
టాపిక్