Jagan Bail petetion: జగన్, సాయిరెడ్డి విదేశీ పర్యటనలపై సిబిఐ అభ్యంతరం
CBI Court: విదేశీ పర్యటనలకు అనుమతించాలని కోరుతూ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై తీర్పును సిబిఐ కోర్టు వాయిదా వేసింది. జగన్, సాయిరెడ్డి దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలని సిబిఐ విజ్ఞప్తి చేసింది.
CBI Court: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనలకు అనుమతించాలని దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు కుటుంబ సమేతంగా ఇంగ్లండ్ వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ సీఎం జగన్ సిబిఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నెల రోజులపాటు విదేశీ పర్యటనలకు అనుమతించాలని కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టును ఆశ్రయించారు. ఇరువురి తరఫున దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
జగన్, సాయిరెడ్డి విదేశీ పర్యటనలకు సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలకు కోర్టు అనుమతించ కూడదని, ఇరువురు సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది.
యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ సిబిఐ కోర్టులో కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆగష్టు 28వ తేదీన సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ వేశారు..
దేశం విడిచి వెళ్లరాదనే బెయిల్ నిబంధనలు విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్‌లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఈ కేసులో బుధవారం వాదనలు వినిపించిన సీబీఐ.. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది.
విదేశీ యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేశారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై కూడా కోర్టులో వాదనలు ముగిశాయి. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనపై సిబిఐ అభ్యంతరం తెలిపింది. జగన్, సాయిరెడ్డిల అభ్యర్థనలపై నేడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.