Case on Mla Raja Singh: రాజాసింగ్‌పై కేసు.. దర్గాలపై వ్యాఖ్యలు చేసిన ఫలితం
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బీజేపీ శాసన సభ్యుడు రాజాసింగ్‌పై కంచన్ బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ ‘సంబంధిత మత పెద్దలు వచ్చి కలిశారు. ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా (అజ్మీర్ దర్గా) గురించి తప్పుగా మాట్లాడారని వారు ఫిర్యాదు చేశారు. దానిపై తగిన ఎంక్వైరీ చేసి చర్య తీసుకుంటాం..’ అని వివరించారు.
హిందూసోదరులు అజ్మీర్ దర్గాకు వెళుతున్నారని, అక్కడికి ఎవరూ వెళ్లొద్దు.. మొక్కుకోవద్దంటూ రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ చక్రవర్తి పృధ్వీరాజ్ భార్యను వివస్త్రను చేసి అత్యాచారానికి పాల్పడిన ఆ ప్రాంతానికి హిందువులు ఎవరూ వెళ్లొద్దంటూ ఓ సభలో వ్యాఖ్యానించారు.
కాగా నుపుర్ శర్మను సస్పెండ్ చేసినట్టు ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ముస్లిం మతపెద్దలు డిమాండ్ చేశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు.
కాగా రాజాసింగ్‌పై వివిధ ఆరోపణలు, ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై మరో వివాదంలో కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక వివరాలు వెల్లడించేలా వీడియో రిలీజ్ చేశారన్న ఆరోపణలపై ఆబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సంబంధిత కథనం