భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్దిపై కేసు..-case filed against minister malla reddy brother in law in land dispute ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Case Filed Against Minister Malla Reddy Brother In Law In Land Dispute

భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్దిపై కేసు..

దాడిలో గాయపడిన వ్యక్తి
దాడిలో గాయపడిన వ్యక్తి

భూ వివాదంలో మంత్రి మల్లారెడ్డి బావ మరిది గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదైంది.

గుండ్లపోచంపల్లి మున్సిపల్ సర్వే నంబర్ 5, 6 లలో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణు నాయుడుల మధ్య స్థల వివాదం జరుగుతోంది. ఈ నెల 17 న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన 30 నుండి 40 మంది వ్యక్తులు మద్యం సేవించి స్థలం చుట్టూ ఉన్న కాడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బందిని తీవ్రంగా గాయపరిచినట్టుగా పోలీసులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

కర్రలతో దాడి చేసి కారం పొడి చల్లుతూ స్థలం వద్ద నానా హంగామా సృష్టించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే వాచ్ మెన్ పై దాడి చేశారు. వాచ్ మెన్ ఆర్. కె. అలెక్సగ్జాండర్ ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అయితే అందులో 10 మందిని రిమాండ్ కు తరలించామని సీఐ రమేష్ తెలిపారు. మరో 5 గురు మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నరసింహ రెడ్డి, బచ్చేంద ర్ సింగ్ లు పరారీలో ఉన్నారని పోలీసులుతెలిపారు.

టాపిక్