Cancellation of Trains: తెలంగాణ, ఏపీ పరిధిలోని పలు రైళ్లు రద్దు - రూట్స్ ఇవే
South Central Railway Updates: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో నడుస్తున్న రైళ్లను రద్దు చేసింది. ఇందుకు సంబంధించి తేదీలను వెల్లడించింది. మరికొన్నింటిని దారిమళ్లించింది.
South Central Railway Cancelled Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పలుమార్గాల్లో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. మరమ్మత్తు పనుల కారణంగా వీటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని రూట్లలో నడిచే రైళ్లను దారి మళ్లించింది. ఆయా వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి.
రద్దు అయిన రైళ్లు…
డాండ్ - నిజామాబాద్ (ట్రైన్ నెంబర్ 11409 ) మధ్య నడిచే రైలును అధికారులు రద్దు చేశారు. మార్చి 30వ తేదీన ఈ సర్వీస్ అందుబాటులో ఉండదు. నిజామాబాద్ - పూణె(ట్రైన్ నెంబర్ 11410) మధ్య నడిచే రైలును ఏప్రిల్ 1వ తేదీన రద్దు చేశారు. నాందేడ్ - పూణె(ట్రైన్ నెంబర్ 17630) మధ్య నడిచే రైలును…మార్చి 28వ తేదీన రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పూణె - నాందేడ్ (ట్రైన్ నెంబర్ 17629) మధ్య నడిచే రైలును మార్చి 29వ తేదీన రద్దు చేశారు. బెంగళూరు - న్యూ ఢిల్లీ మధ్య నడిచే రైలును… దారి మళ్లించారు. మార్చి 28వ తేదీన పూణె- లోనవాలా- వాసయి రోడ్డు - వడోదర - రట్లం మీదుగా వెళ్తుంది. హౌరా - పూణె మధ్య నడిచే రైలును మార్చి 27వ తేదీన నాగ్ పూర్, బలార్షా, సికింద్రాబాద్, వాడి, డాండ్, పూణె మీదుగా మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. హఠియా - పూణె మధ్య నడిచే రైలును మార్చి 27వ తేదీన నాగ్ పూర్, బలార్షా, సికింద్రాబాద్, వాడి, డాండ్, పూణె మీదుగా మళ్లించారు.
ఏపీ పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు. విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెంబర్ 07464), గుంటూరు - విజయవాడ(ట్రైన్ 07465), విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెంబర్ 07628) మధ్య నడిచే రైళ్లను… మార్చి 25 నుంచి మార్చి 26వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు - రేపల్లె మధ్య నడిచే రైలు(ట్రైన్ 07786)ను గుంటూరు - తెనాలి మధ్య పాక్షికంగా రద్దు చేశారు. నర్సాపూర్ - గుంటూరు (ట్రైన్ నెంబర్ 17282) మధ్య నడిచే రైలును దారి మళ్లించారు. మార్చి, 25, 26వ తేదీల్లో తెనాలి మీదుగా మళ్లించారు.
సమ్మర్ ట్రైన్స్.. వివరాలు
వేసవి దృష్ట్యా పలు ప్రత్యేక రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు వివరాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. తిరుపతి - అకోలా, అకోలా - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది మార్చి 3 నుంచి మే 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇక అకోలా - తిరుపతి రూట్ లో నడిచే రైలును కూడా... మార్చి 19 నుంచి మే 28వ తేదీ వరకు పొడిగించారు. తిరుపతి - పూర్ణ, పూర్ణ - తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన స్పెషల్ ట్రైన్స్ ను కూడా మార్చి 3 నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు. హైదరాబాద్ - నర్సాపూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును... మార్చి 18వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు పొడిగించగా... నర్సాపూర్ - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్ ను మార్చి 19వ తేదీ నుంచి మే 28 తేదీ వరకు పొడిగించారు. హైదరాబాద్ - తిరుపతి, తిరుపతి - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ ను కూడా పొడిగించారు అధికారులు. మార్చి 30వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు.విజయవాడ- నాగర్ సోల్, నాగర్ సోల్ - విజయవాడ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించారు.