Hyderabad Rape : హైదరాబాద్‌లో దారుణం.. విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!-cab driver rapes german woman in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Rape : హైదరాబాద్‌లో దారుణం.. విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!

Hyderabad Rape : హైదరాబాద్‌లో దారుణం.. విదేశీ యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం!

Hyderabad Rape : ఆ యువతిది జర్మనీ. హైదరాబాద్‌లో ఉన్న తన ఫ్రెండ్‌ను కలుద్దామని వచ్చింది. అలాంటి వారికి ఆతిథ్యం ఇవ్వాల్సిందిపోయి.. ఓ కామాంధుడు వికృతంగా ప్రవర్తించాడు. కారులో ఎక్కుంచుకొని క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విదేశీ యువతిపై అత్యాచారం (istockphoto)

తెలంగాణలో యువతులపై అత్యాచారయత్నం, అత్యాచారం ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన మరువక ముందే.. హైదరాబాద్‌లో కామాంధుడు రెచ్చిపోయాడు. విదేశీ యువతిని రేప్‌‌ చేశాడు. పహాడీ షరీఫ్‌ దగ్గర జర్మనీ యువతిపై అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. కారులో ఎక్కించుకున్న డ్రైవర్ మార్గమధ్యంలో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఏం జరిగింది..

సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని తన స్నేహితుడి వద్దకు వెళ్తున్న 25 ఏళ్ల జర్మన్ యువతిపై.. పహాడిషరీఫ్‌లోని మామిడిపల్లి వద్ద అత్యాచారం జరిగింది. విమానాశ్రయానికి వెళుతుండగా క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన స్నేహితురాలితో పాటు మరికొంతమందితో కలిసి నగరంలో పర్యటిస్తోంది.

నిర్మానుష్య ప్రదేశంలో ఆపి..

ఇతర ప్రయాణీకులను దింపిన తర్వాత, డ్రైవర్ ఆమెను విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. అయితే, మామిడిపల్లి సమీపంలో అతను వాహనాన్ని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆపి, అక్కడ ఆ మహిళపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఆ మహిళ పోలీసులను సంప్రదించింది. పహాడిషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 64 కింద అత్యాచార కేసు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు.

గ్యాంప్ రేప్ కాదు..

ఆ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని పుకార్లు వచ్చాయి. పోలీసులు ఈ వాదనలను తోసిపుచ్చారు. ఇది డ్రైవర్ చేసిన పని అని నిర్ధారించారు. ఆ మహిళను వైద్య పరీక్ష కోసం పంపారు. మహిళా పోలీసు అధికారుల బృందం ఆమెతో పాటు ఉంది. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించారు.

ఆ మహిళ రెండు సంవత్సరాల కిందట జర్మనీలో చదువుకున్న తన స్నేహితుడిని కలవడానికి వారం కిందట హైదరాబాద్‌కు వచ్చింది. (లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. బాధితురాలి గోప్యతను కాపాడటానికి ఆమె గుర్తింపును వెల్లడించడం లేదు)