Telangana NMMS Hall Tickets : ఎన్‌ఎంఎంఎస్‌ హాల్‌టికెట్లు విడుదల-bse telangana released the nmms hall tickets telangana on its official website ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Nmms Hall Tickets : ఎన్‌ఎంఎంఎస్‌ హాల్‌టికెట్లు విడుదల

Telangana NMMS Hall Tickets : ఎన్‌ఎంఎంఎస్‌ హాల్‌టికెట్లు విడుదల

Telangana NMMS 2023 Updates : నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటన విడుదల చేసింది.

ఎన్‌ఎంఎంఎస్‌ హాల్‌టికెట్లు విడుదల

National Means cum Merit Scholarship Examination : నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం. డిసెంబర్ 10 తేదీన నిర్వహించబోయే పరీక్షకు సంబంధించి… హాల్ టికెట్లను విడుదల చేసింది. https//bse.telanangana.gov. in   వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

డిసెంబర్ 10వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.