HYD Crime: హైదరాబాద్‌లో దారుణ హత్య, మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్‌తో మరొకరి బలి-brutal murder in hyderabad another victim of rash driving under the influence of alcohol ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Crime: హైదరాబాద్‌లో దారుణ హత్య, మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్‌తో మరొకరి బలి

HYD Crime: హైదరాబాద్‌లో దారుణ హత్య, మద్యం మత్తులో రాష్ డ్రైవింగ్‌తో మరొకరి బలి

HT Telugu Desk HT Telugu
Jun 14, 2024 11:14 AM IST

HYD Crime: హైదరబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో నడి రోడ్డుపై అందారు చూస్తుండగానే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన యువకుడు
హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన యువకుడు

HYD Crime: హైదరబాద్‌లో దారుణం చోటు చేసుకుంది.రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలో నడి రోడ్డుపై అందారు చూస్తుండగానే ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం......చంపాపెట్ లోని బాబా నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ (28) డెకరేషన్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డెకరేషన్ పనులు నిమిత్తం బాబా నగర్ లో తన ఇంటికి కాలి నడకన వెళుతూ ఉండగా... మార్గమధ్యంలో బాలా పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ ను గుర్తు తెలియని ముగ్గురు యువకులు అడ్డగించి కత్తులతో పొడిచి,కర్రలతో కొట్టి హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న బాల పూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

హత్య జరిగిన ప్రాంతంలో చాలా మంది యువకులు గంజాయి సేవించి అర్ధ రాత్రులు తరచూ గొడవలు చేస్తూ ఉంటారని పోలిసులకు స్థానికులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం సయ్యద్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరి గుర్తు తెలియని వ్యక్తులు మధ్య గొడవ,ఒకరి హత్య

ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొడవ పడి అందులో ఒక వ్యక్తి హత్యకు గురైన ఘటన హైదరాబాద్ లోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.......నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గొడవ పడి కొట్టుకున్నారు.

ఈ క్రమంలో ఒక వ్యక్తి చాతి పై మరో వ్యక్తి ఇటుక తో బలంగా కొట్టాడు. దీంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు అని వైద్యులు నిర్ధారించారు.పోస్టుమార్టం నిమిత్తం వ్యక్తి మృతి దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.మృతుడి వయసు సుమారు 35 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలు ఆధారంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు హత్య చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

మద్యం మత్తులో రాష్‌ డ్రైవింగ్..ఒకరి మృతి

హైదరాబాద్ లోని నాంపల్లిలో జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నలుగురు స్నేహితులు రాజశేఖర్,మధు, శ్రీకాంత్ మరియు రామాంజనేయులు కూకట్ పల్లి లో ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ ప్రైవేట్ ట్రావెల్స్ లో పని చేస్తున్నారు.

మంగళవారం రాజశేఖర్ జన్మదినం సందర్భంగా ఈ నలుగురు పీకలదాకా మద్యం సేవించారు.ఆ తరువాత కారులో చార్మినార్ వద్దకు వెళ్లి కేక్ కట్టింగ్ చేశారు. రాత్రి 12:30 గంటల సమయంలో చార్మినార్ నుంచి కూకట్ పల్లికి తిరిగి వస్తుండగా......నాంపల్లి మెట్రో స్టేషన్ వద్ద వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి అటుగా వెళుతున్న ఆటోను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో హఫీజ్ పెట్‌కు చెందిన నరసింహా రావు అనే ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆటో డ్రైవర్ కాచిగూడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టు ఆడుతున్నారు. ఆటోను ఢీ కొట్టిన యువకులు కారును ఆపకుండా అలానే వెళ్ళిపోయారు.

అదే సమయంలో నేరెడ్ మెట్ ప్రాంతానికి చెందిన మరో యువకుడు అజయ్ (27) ఆ కారును ఆపే ప్రయత్నం చేయగా అతన్ని కూడా కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు.మృతుడి స్నేహితుడు సాయి తేజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.ఈ ఘటనలో ప్రమాదాలకు కారకులైన నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా)Ht

WhatsApp channel