KTR : సమగ్ర కుటుంబ సర్వేనే అఫిషియల్ సర్వే, పదేళ్లలో 1.64 కోట్ల బీసీ జనాభా ఎలా తగ్గారు? - కేటీఆర్
KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కులగణన సర్వేపై అసెంబ్లీలో మాట్లాడుతూ...2014లో బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేనే అఫిషియల్ సర్వే అని పేర్కొన్నారు.
KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలకు నమ్మకం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కులగణన సర్వేపై అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ... 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిపిన సమగ్ర కుటుంబ సర్వేనే అఫిషియల్ సర్వే అన్నారు. అప్పుడు సర్వే చేసిన అధికారులు శాంతి కుమారి, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా వీళ్లు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నారన్నారు.

గతంలో ప్రభుత్వమే సర్వే చేసిందని, వాటిని ఓపెన్‌గా వెబ్‌సైట్‌లోనే పెట్టామన్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే, రేవంత్ రెడ్డి ప్రజలకు తమ వివరాలు ఇవ్వద్దని బహిరంగంగా పిలుపునిచ్చారన్నారు.
"కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో బిల్లు ఏమైనా తెస్తున్నారేమో అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల సోదరులు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ వివరాలు ఇవ్వలేదంటున్నారు...సర్వే పేరిట 57 రకాల వివరాలను అడిగితే ఎలా ఇస్తాం? ఎవరికి పడితే వారికి వివరాలు ఎలా ఇస్తాం?" - కేటీఆర్
కులగణన రిపోర్ట్ బోగస్
2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 1 కోటి 85 లక్షల 61 వేల 856 అంటే 51%, ముస్లిం బీసీల 10% కూడా కలిపితే, మొత్తం బీసీల సంఖ్య 61% అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల్లో 51% ఉన్న బీసీ జనాభా 46% ఎట్లా అయిందని ప్రశ్నించారు. 1 కోటి 64 లక్షలకు బీసీ జనాభా ఎలా తగ్గిందని నిలదీశారు. కుల గణన సర్వే రిపోర్ట్ బోగస్, తగలబెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే మాట్లాడారన్నారు.
57 రకాల వివరాలు ఎలా ఇస్తాం
"కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా బలహీనవర్గాలు ఎదురుచూస్తున్నాయి. కానీ ఇక్కడ సీఎం మాత్రం వేరే విషయాలు మాట్లాడుతున్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తే ఎవరినీ వివరాలు ఇవ్వకండా రేవంత్ రెడ్డి చెప్పారు.
ఆ వీడియాలు యూట్యూబ్ లో ఉన్నాయి. ఇప్పుడు 57 రకాల వివరాలు ఇవ్వడంటూ ఎన్యుమరేటర్ లను పంపిస్తే వివరాలు ఎలా ఇస్తాం. ఎన్యుమరేటర్లకు మీ వీడియోలు చూపించాం. సమగ్ర కుటుంబ సర్వేలో 1 కోటి 3 లక్షల 95 వేల కుటుంబాలు అంటే 3.68 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారు. ఒక్క రోజులో సర్వేలో పాల్గొన్నారు" -కేటీఆర్
సంబంధిత కథనం