TS Assembly Sessions : రేవంత్ రెడ్డి గారు.. మీ వాళ్లతోనే జాగ్రత్త ఉండండి - సభలో కడియం ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Session Updates 2024: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం సభలో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Assembly Session Updates 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తుండగా… ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం సభలో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడిన కడియం శ్రీహరి…. “నేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే హస్టల్ లో ఉండేవాళ్లం. నేను సీనియర్ స్టూడెంట్, రేవంత్ రెడ్డి జూనియర్ స్టూడెంట్ గా ఉండేది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మావైపు నుంచి రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ రేవంత్ రెడ్డి… ఆ పార్టీ వాళ్లతోనే జాగ్రత్తగా ఉండాలి. ఆ పార్టీలోని కొందరు ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు. వాళ్లను జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది” అంటూ కడియం కామెంట్స్ చేశారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. కాళేశ్వరం రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని.. దీంతో రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది. ప్రాజెక్టు రీ ఇంజనీరింగ్ పేరుతో ముందే ప్రారంభించిన ప్రాజెక్టుల్ని ఆపేయడం వల్ల భారీగా నష్టం వాటిల్లిందని కాగ్ పేర్కొంది. శాసనసభలో ప్రవేశపెట్టిన నివేదికలో ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పలు అంశాలను ప్రస్తాచింది. డిపిఆర్ అమోదించానికి ముందు 25వేల కోట్ల రుపాయల పనులు ప్రారంభించారని కాగ్ పేర్కొంది. తొలుత 2టిఎంసిల ఎత్తిపోయాలని ప్రతిపాదించి దానిని 3 టిఎంసీలకు పెంచడంతో 28,151కోట్ల అదనపు వ్యయం ఖర్చైనట్టు పేర్కొంది.
మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంపై మొత్తం రూ.7.11లక్షల కోట్ల అప్పుల భారం ఉందని చెప్పారు. అప్పులకు వడ్డీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయక తప్పట్లేదన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన చేశామన్న… ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం 40 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. 563 గ్రూప్-1 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేయబోతున్నామని వెల్లడించారు. వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ రూపాకల్పన చేశామన్న భట్టి… గత ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి బడ్జెట్ తీసుకువచ్చిందన్నారు. ఆరు గ్యారెంటిలకు 53వేలు కేటాయించామని… ఇందులో తప్పేముందని వెల్లడించారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించి రాబడి రాకుండ ాఎత్తి వేయడం వల్ల పేదలు, బడుగు బలహీన వర్గాల కొరకు కేటాయించిన సంక్షేమ పథకాలకు కోత పడుతుందన్నారు. ఆదాయం బాగున్న తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ లో పెట్టిన ఖర్చు 79 శాతం మాత్రమే ఉండటం దురద్రుష్టకరమని వ్యాఖ్యానించారు.