Bandi Sanjay: కరీంనగర్‌లో బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌, నకిలీ నోట్ల ఆరోపణలపై ఫైర్-brs leaders complained to the police against bandy sanjay ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: కరీంనగర్‌లో బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌, నకిలీ నోట్ల ఆరోపణలపై ఫైర్

Bandi Sanjay: కరీంనగర్‌లో బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌, నకిలీ నోట్ల ఆరోపణలపై ఫైర్

Sarath Chandra.B HT Telugu

Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కరీంనగర్ లో పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసిఆర్ కుటుంబం దొంగ నోట్లు ముద్రించిందనే ఆరోపణపై గులాబీ శ్రేణులు ఫైర్ అయ్యాయి.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌

Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసిఆర్ కుటుంబ దొంగ నోట్లు ముద్రించి పంచారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణ పట్ల బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసీఆర్ దోస్తు కు బీదర్ లో దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని, అందులో ముద్రించిన దొంగ నోట్లు ఉద్యమ సమయంలో ఎన్నికలప్పుడు పంచారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. దొంగ నోట్లతోనే కేసిఆర్ కుటుంబసభ్యులు కోటీశ్వరులు అయ్యారని విమర్శించారు.

బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల బిఆర్ఎస్ నాయకులు అగ్గిమీద గుగ్గిలంలా మారి మండిపడుతున్నారు. నిరాధారమైన ఆరోపణలతో కేసిఆర్ కుటుంబ సభ్యుల ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడిన మంత్రి బండి సంజయ్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న

గర ఏసిపి వెంకటస్వామి కి రాతపూర్వకంగా పిర్యాదు చేసి బండి సంజయ్ వ్యాఖ్యల పై కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణలో కేసీఆర్ కు దొంగ నోట్లతో సంబంధం లేదని తేలితే కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరాశరమైన ఆరోపణలతో కేసీఆర్ పరువుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్న బండి సంజయ్ బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు.

కేంద్ర మంత్రివా...కార్పోరేటర్ వా...

దొంగ నోట్లతో కేసిఆర్ కుటుంబానికి సంబంధం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించి తన స్థాయిని దిగజార్చుకున్నారని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి కార్పోరేటర్ కంటే హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కరీంనగర్ కు చెందిన బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాడు అంటే అందరం గర్వంగా సంతోషపడ్డామని కానీ ఇంత చిల్లరగా మాట్లాడడం చూస్తే ఈయన కేంద్ర మంత్రి అయ్యాడంటే అవమానంగా ఫీల్ అవుతున్నామని అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కులం మతం పేరుతో రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్న బండి సంజయ్ వ్యవహార శైలి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేశావా?....

కెసిఆర్ దోస్త్ కు బీదర్ లో ప్రింటింగ్ ప్రెస్ ఉందని... అందులో దొంగ నోట్లు ముద్రించారని ఆరోపించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఎలా తెలుసని మరి కొందరు బిఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. బండి సంజయ్ ప్రింటింగ్ ప్రెస్ లో పని చేశావా అని కరీంనగర్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మెప్పు పొందేందుకే బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బిజెపి ఒక్కటే డైవర్షన్ డ్రామాలో భాగమే దొంగ నోట్ల ఆరోపణలని తెలిపారు. కాంగ్రెస్ బిజెపి నేతలు కెసిఆర్ పై బిఆర్ఎస్ నాయకులపై అనవసర ఆరోపణలు చేస్తే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు.

రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం