Telangana Politics : గత కొద్దిరోజులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెంటర్ గా.... ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి. రేపోమాపో కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమవుతున్న ఆయన... తనతో పాటు మరికొంత మంది నేతలను కూడా హస్తం గూటికి చేర్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. బుధవారం రేవంత్ రెడ్డి కూడా.... పొంగులేటితో భేటీ కానున్నారు. చేరికపై అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఇదే సమయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత కూడా పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. అయితే ఆయన కూడా కాంగ్రెస్ లోకి చేరబోతున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలపై నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి, ఉత్తమ్... గరమవుతున్నట్లు తెలుస్తోంది.
వేముల వీరేశం.... ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గానికి చెంది నేత. 2014లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.... 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇదే టైంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన....చిరుమర్తి లింగయ్య కారెక్కారు. దీంతో... వీరేశం డైలామాలో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా లింగయ్యకే టికెట్ దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో... వీరేశం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే....ఆయన పొంగులేటి నివాసానికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే టైంలో రేవంత్ రెడ్డి కూడా... పొంగులేటి నివాసానికి వెళ్తుండటంతో... వీరేశంతో కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే హస్తం గూటికి చేరటం ఖాయంగానే కనిపిస్తుందన్న వార్తలు జోరుగు వినిపిస్తున్నాయి.
అయితే తాజా పరిణామాలపై నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. జిల్లా నేతలకు తెలియకుండా.... ఇలా చర్చలు జరపడమేంటని ప్రస్తావించినట్లు సమాచారం. కనీసం తమకు ఒక్క మాట కూడా చెప్పరా అంటూ ఆ ఇద్దరు నాయకులు మండిపడుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పలు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. నిర్మల్, కొడంగల్, గజ్వేల్, మానకొండూరు నియోజకవర్గాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు.
సంబంధిత కథనం