BRS Mla Brother Arrest: అక్రమ మైనింగ్ ఆరోపణలపై పటాన్‌చెరు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
BRS Mla Brother Arrest: అక్రమ మైనింగ్ ఆరోపణలపై పటాన్ చెరు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి అరెస్ట్ చేయడంపై బిఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Mla Brother Arrest: సంగారెడ్డి Sanga reddyజిల్లా పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తున్నారనే ఫిర్యాదుతో మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్ కి తరలించనున్నారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మధుసూదన్ రెడ్డి క్రషర్ కంపెనీలు నిర్వహిస్తున్నాడు. నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమి లీజుకు తీసుకుని మరో నాలుగు ఎకరాలలో అక్రమంగా క్రషింగ్ నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
దీంతో పరిమితికి మించి గుట్టల్ని తవ్వేస్తున్నారని మైనింగ్ శాఖ నివేదిక ఇచ్చింది. ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మైనింగ్ శాఖ నిబంధనలు పాటించక పోవడంతో అధికారులు క్రషర్లను సీజ్ చేశారు.
అనుమతుల గడువు ముగిసినప్పటికీ మైనింగ్ కొనసాగించారని అధికారులు ఆయనపై పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా శుక్రవారం తెల్లవారుజామున మధుసూదన్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ తో పటాన్ చెరు పోలీస్ స్టేషన్ కి భారీగా BRS కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో స్టేషన్ ఎదుట పోలీసుల మోహరించారు.
మరోవైపు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను లొంగదీసుకోవడానికే అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. పోలీసులు నోటీసుల ఇవ్వకుండా అర్థరాత్రి బలవంతంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు.