Bhadrachalam Talambralu : ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణ ముత్యాల తలంబ్రాలు.. ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోండి-bookings begin for bhadrachalam sri rama navami kalyanam mutyala talambralu ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bhadrachalam Talambralu : ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణ ముత్యాల తలంబ్రాలు.. ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోండి

Bhadrachalam Talambralu : ఇంటి వద్దకే భద్రాద్రి శ్రీరామనవమి కల్యాణ ముత్యాల తలంబ్రాలు.. ఈ లింక్ ద్వారా బుక్ చేసుకోండి

Bhadrachalam Talambralu : భద్రాచలం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబవుతోంది. సీతారాముల కల్యాణోత్సవాన్ని నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి రాలేని భక్తుల కోసం అధికారులు మరో సౌకర్యం కల్పించారు. ముత్యాల తలంబ్రాలను ఇంటి వద్దకే పంపిస్తున్నారు.

ముత్యాల తలంబ్రాల బుకింగ్

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భద్రాద్రి రామయ్య ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. శ్రీరామనవమి కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపే ఏర్పాట్లు చేశారు. తలంబ్రాల కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. బుక్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలను పంపిస్తామని ఈవో రమాదేవి వివరించారు. ముత్యాల తలంబ్రాల ధర ఒక ప్యాకెట్‌కు రూ.60 ఉంటుంది. తలంబ్రాలు బుక్ చేసుకున్న భక్తులకు పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తారు.

ఈ లింక్ ద్వారా..

ముత్యాల తలంబ్రాలను https://bhadradritemple.telangana.gov.in/mt_bookings/?ssid=153 లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. పోస్టల్, ఆర్టీసీ కార్గోల కోసం వేర్వేరు బుకింగ్స్ ఉంటాయి. ఇటు ఆర్టీసీ, అటు పోస్టల్ శాఖలతో ఆలయ అధికారులు సమన్వయం చేసుకొని.. తలంబ్రాలను ఇంటికి పంపిస్తారు.

ఎలా బుక్ చేసుకోవాలి..

పై లింక్ ఓపెన్ చేసిన తర్వాత.. ఆలయ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇంగ్లీష్, తెలుగులో పేరును నమోదు చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. అడ్రస్ వివరాలను సమర్పించాలి. రాష్ట్రం, జిల్లా, మండలం, టౌన్, గ్రామం వివరాలను పొందుపర్చాలి. ఇంటి నంబర్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, పిన్‌కోడ్ వివరాలను నమోదు చేయాలి. ఒక్కో ప్యాకెట్‌కు 60 రూపాయలు ఉంటుంది. వివరాలు అన్ని చూసుకొని పేమెంట్ చేయాలి.

అత్యంత వైభవంగా..

భద్రాచలం రాముల వారి కల్యాణం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. భక్తులు ఈ కల్యాణాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. లక్షలాది భక్తులు ఈ వేడుకకు తరలివస్తారు. కళ్యాణానికి భక్తులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చాలా మంది భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు.

ఎంతో ప్రాముఖ్యత..

భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తలంబ్రాలలోని ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ముత్యాలు స్వచ్ఛతకు, ప్రశాంతతకు చిహ్నంగా భావిస్తారు. వధూవరులు కల్మషం లేని మనస్సుతో ఆనందంగా జీవించాలని ఇది సూచిస్తుంది. పసుపు శుభానికి, సౌభాగ్యానికి ప్రతీక. ధాన్యం సిరిసంపదలకు, సుసంపన్నమైన జీవితానికి చిహ్నంగా భావిస్తారు. ఇంకా, భద్రాచలంలోని సీతారాముల వారి కల్యాణానికి ఉపయోగించే తలంబ్రాలను మహిళలు వారి చేతులతో, గోళ్లతో మాత్రమే సిద్ధం చేస్తారు. వీటినే "కోటి గోటి తలంబ్రాలు" అని అంటారు. ఇలా తయారు చేయడం వల్ల ఈ తలంబ్రాలకు మరింత పవిత్రత చేకూరుతుందని భక్తులు నమ్ముతారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.