Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్-bomb threat call to telangana secretariat ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్

Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్

Basani Shiva Kumar HT Telugu
Feb 04, 2025 04:14 PM IST

Telangana Secretariat : తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అలర్ట్ అయిన పోలీసులు.. ఫోన్‌ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. దీంతో పోలీసులు, సచివాలయ ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు
తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు

హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయాన్ని పేల్చివేస్తానని బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడు రోజుల లంగర్ హౌజ్‌కు చెందిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీ నుంచి ఫోన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతను దర్గాకు సంబంధించి ఓ సమస్యపై ప్రభుత్వానికి తాను అర్జీ పెట్టుకున్నాడు. అధికారులు స్పందించక పోవడంతో బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.

yearly horoscope entry point

బాంబు లేదు..

ఫోన్ చేసిన సయ్యద్ మీర్ మహ్మద్ అలీని అదుపులో తీసుకొని ఎస్పీఎఫ్ పోలీసులు విచారించారు. ఈ సమయంలో పోలీసులు, సెక్రటేరియట్ అధికారులతో అతను వాగ్వాదానికి దిగాడు. అటు సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని పోలీసులు తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. అతను ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సైఫాబాద్ పోలీసులు.

భారీ భద్రత..

2024 అక్టోబర్ వరకు సచివాలయం భద్రత బాధ్యతలను.. తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ చూసింది. ఆ తర్వాత తెలంగాణ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌‌కు అప్పగించింది. కమాండెంట్‌ దేవీదాస్‌ సచివాలయ ప్రధాన భద్రతాధికారిగా నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో 212 మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. వీరే కాకుండా.. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు శాంతి భద్రతలు, ట్రాఫిక్‌, ఆక్టోపస్‌ క్విక్‌ రియాక్షన్‌ టీమ్ విధుల్లో ఉంటాయి.

నకిలీ ఉద్యోగి హల్చల్..

ఇటీవల తెలంగాణ సచివాలంలో ఓ నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. అతని కదలికలు అనుమానంగా ఉండడంతో.. సచివాలయ సీఎస్‌వో దేవిదాస్ ఆదేశాల మేరకు.. ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నిఘా పెట్టారు. పూర్తి ఆధారాలు సేకరించి.. చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు అతన్ని పట్టుకున్నారు.

ఫేక్ ఐడీ కార్డుతో..

ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు.. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు సృష్టించుకున్నాడు. మైనార్టీ డిపార్ట్‌మెంట్ సెక్షన్ ఆఫీసర్ వి.ప్రశాంత్ డ్రైవర్ రవి.. భాస్కర్ రావుకు ఫేక్ ఐడి కార్డు తయారు చేయించినట్టు అధికారులు గుర్తించారు. డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Whats_app_banner